ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్ని ప్రణాళికలు రచించిన కూడా వైఎస్ జగన్ తన అధికారాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో వైకాపా అభ్యర్థులు చిత్తుగా చిత్తుగా ఓడిపోయారు. 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ ఫైనల్ గా 11 స్థానాలను గెలుచుకుంది.
సరైన సంఖ్యాబలం లేకపోవడంతో అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు. ప్రతిపక్ష హోదా పొందడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో మరో పార్టీ లేకపోవడం వల్ల తమకే ఆ హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి జగన్ ఆల్రెడీ లేఖ రాశారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ససేమెరా అనేసింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పొందాలంటే 10 శాతం సీట్లు ఉండాలని ప్రభుత్వం బలంగా చెబుతోంది.
కానీ జగన్ మాత్రం ఎవరి మాటలు పట్టించుకోవడం లేదు. రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదంటూ వాదిస్తున్నారు. ఇక తాజాగా ప్రతిపక్ష హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని జగన్ పిటిషన్ లో కోరారు. పది శాతం సభ్యుల బలం లేకపోయినా చట్టసభల్లో విపక్ష నేత హోదా కల్పించిన ఉదాహరణలను జగన్ తన పిటిషన్ లో వివరించారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇక త్వరలోనే హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.