సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసినా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు ఇంకా సికింద్రాబాద్ లోని సైనికాసుపత్రిలోనే ఉన్నారు. బహుశా సోమవారం సాయంత్రానికి డిస్చార్జవుతారేమో.
ఎంపికి బెయిల్ ఇచ్చినట్లు శుక్రవారమే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే న్యాయపరమైన ప్రొసీజర్ కారణంగా ఎంపి ఆసుపత్రిలోనే ఉండిపోయారు.
శుక్రవారం విచారణలో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా శని, ఆదివారాలు కోర్టులకు శెలవులన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత పూచీకత్తు కింద కోర్టుకు లక్ష రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే ఎంపి బెయిల్ పై గ్యారంటీర్ తో సంతకాలు చేయించాలని కూడా షరతు విధించింది. లక్షరూపాయల పూచీకత్తు, గ్యారంటర్ల బాండ్లు సమర్పించాలంటే సోమవారం కానీ సాధ్యంకాదు.
అలాగే సుప్రింకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రొసీజర్ ఫాలో అవటంతో పాటు బెయిల్ కాపీని ఆర్మీ ఆసుపత్రికి సబ్మిట్ చేయాల్సుంటుంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే.
సో అప్పటివరకు ఎంపి ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండకతప్పదు. ఎంపి తరపు లాయర్లు ప్రొసీజర్లు పూర్తి చేసి ఎంపిని డిస్చార్జి చేయించుకునేటప్పటికి బహుశా సోమవారం సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.