ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఏ9 ఎవరు? అని వైసీపీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత చాలా ధైర్యంగా ఒంటరి పోరాటం చేస్తోందని తెలిపారు. ‘‘అవినాష్ రెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా, భాస్కరరెడ్డికి మాత్రం రాలేదు. భాస్కర్ రెడ్డి అంశంలో సీబీఐ లాయర్ బెయిల్ ఇవ్వొద్దు అని పిటిషన్ వేశారు. సునీల్ యాదవ్ దాదాపు 30 సార్లు అవినాష్ నివాసానికి వచ్చి వెళ్ళారు? గూగుల్ టేక్ఔట్లో అన్ని రికార్డ్ అయ్యాయి. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ ముగ్గురే కీలకం. ప్లాన్ చేసింది కూడా ఈ ముగ్గురే’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు.
వివేకా కేసులో A9 ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద అనుమానంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వివేకా హత్య విషయం ఉదయం తెలుసు అని సీబీఐ పేర్కొందని, ఉదయం 5.15కి హత్య విషయం తెలిసిందని చెప్పారు. అవినాష్ రెడ్డి మర్డర్ ఎలా చేస్తాడు అని జగన్ అసెంబ్లీలో చెప్పారని, భారతి పీఏను సీబీఐ గతంలో విచారించిందని ఆర్ ఆర్ ఆర్ చెప్పారు.
జగన్మోహన్ రెడ్డిని, భారతిని విచారించనందునే ఇతర అంశాలు బయటకు రావడం లేదని వ్యాఖ్యానించారు. వారికి ముందే వివేకా హత్య అంశాన్ని ఎవరు చెప్పారో? ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉంది అని రఘురామ డిమాండ్ చేశారు.
అది వైసీపీ నేతల పనే!
గుంటూరులో దొంగ ఓట్లను ఎక్కువగా నమోదు చేయడం వెనుక వైసీపీ పార్టీ వాళ్లు ఉన్నారని రఘురామ వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడాలని విపక్ష పార్టీలకు ఆయన సచించారు. “వీలైతే ఓట్లను పరిశీలించండి. జగన్ క్రిస్టియన్ అని ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఉంది. బహుశా అందుకే బి.టెక్ రవి జగన్మోహన్ రెడ్డిని రెడ్డే కాదని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తారు కాబట్టే బీటెక్ రవి అలా అని ఉండొచ్చు.’’ అని రఘురామ అన్నారు.