నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో `అన్ స్టాపబుల్` సీజన్ 4 ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు. వెంకీ తో పాటుగా ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు, `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ యూనిట్ అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సైతం బాలయ్య షోలో సందడి చేశారు.
అన్స్టాపబుల్ షోలో బాలయ్య, వెంకీ నడుమ ఎన్నో ఆసక్తికర సంభాషణలు సాగాయి. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు ఫ్యామిలీ విశేషాలను కూడా వెంకీ పంచుకున్నారు. విదేశాల్లో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలన్నది నా కోరిక. 1986లో ఇండియాకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇక ఈ క్రమంలోనే దిగ్గజ నిర్మాత, నటుడు దగ్గుబాటి రామానాయుడు గురించి బాలయ్య అడగ్గా.. వెంకీ మరియు సురేష్ బాబు తమ తండ్రి ఆఖరి రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
వెంకీ మాట్లాడుతూ.. నాన్న తన జీవితం మొత్తాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాము. ఆఖరి రోజుల్లో కూడా ఆయన సినిమా స్క్రిప్ట్స్ చదివే వాళ్ళు. ఒక కథ బాగా నచ్చి నాకు చెప్పారు. ఇద్దరం కలిసి చేద్దామన్నారు. కానీ ఆయన అనారోగ్యంగా ఉండటంతో ఆ సినిమా చేయలేకపోయాము. నాన్నతో కలిసి ఆ సినిమా చేసుంటే బాగుండేదని ఇప్పటికీ బాధపడతాను. ఆయన ఆఖరి కోరిక తీర్చలేకపోయా` అంటూ వెంకీ ఎమోషనల్ అయ్యారు. అలాగే సురేష్ బాబు మాట్లాడుతూ.. వెంకీ తో కలిసి సినిమా చేయలేదని, మంచి చేసిన ఎంపీగా గెలవలేకపోయానని నాన్న బాధపడ్డారు అంటూ చెప్పుకొచ్చారు.