‘మినిమం డిగ్రీ ఉండాలి…అంతకంటే కింది స్థాయి వాళ్లకి అర్థం కాదు…’..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన డైలాగులలో ఇది ఒకటి. ఒక సినిమాకు రివ్యూ చెప్పే క్రమంలో ఓ సామాన్య యువకుడు చెప్పిన ఈ డైలాగ్ వైరల్ గా మారింది. కట్ చేస్తే…ఇదే డైలాగ్ ను ఇపుడు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వాడేస్తున్నారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన టీడీపీ అభ్యర్థులు, జనసేన ప్రకటించిన జనసేన అభ్యర్థులకు ఈ డైలాగ్ ను అప్లై చేసి ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. కూటమి తరఫున బరిలోకి దిగబోతున్న అభ్యర్థులలో అందరూ మినిమం డిగ్రీ పాసైన వారేనని చెబుతూ వైసీపీని ట్రోల్ చేస్తున్నారు.
టీడీపీ-జనసేన ప్రకటించిన 99 మంది అభ్యర్థులలో అందరూ ఉన్నత విద్యావంతులేనని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. 63 మంది గ్రాడ్యుయేట్లు, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు పీహెచ్ డీ చేసినవారు, ఒక ఐఏఎస్, ముగ్గురు ఎంబీబీఎస్ చదివిన వారు..మొత్తం 99 మంది కనీసం డిగ్రీ చదివిన వారే. అదే సమయంలో వైసీపీ అభ్యర్థులలో చాలామంది గూండాగిరీలో డిగ్రీలు చేశారని, రౌడీయిజంలో పీహెచ్ డీ పట్టా తీసుకున్నారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు వర్సెస్ గూండా అభ్యర్థులు అని నెటిజన్లు పెడుతున్న పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. టీడీపీలో టికెట్ కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలబ్బా….అదే వైసీపీలో అయితే…అంటూ ట్రోల్ చేస్తున్నారు.