ఇటీవల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా వెడ్డింగ్ మెల్స్ మోగుతున్నాయి. త్వరలోనే బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా ఓ ఇంటిది కాబోతోంది. సినీ నటులు శత్రుఘన్ సిన్హా, పూనమ్ సిన్హాలకు జన్మించిన సోనాక్షి సిన్హా.. 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. మొదటి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దబాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సోనాక్షికి ఆఫర్లు క్యూ కట్టాయి.
దాంతో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సోనాక్షి సిన్హా వరుసగా సినిమాలు చేసింది. బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇటీవల హీరమండి వెబ్ సిరీస్ లో మెరిసిన సోనాక్షి.. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. 37 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లో తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ తో ఏడడుగులు వేసేందుకు సోనాక్షి సిద్ధమైంది.
2022లో వచ్చిన డబుల్ XL మూవీలో సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బల్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఏర్పడ్డ వారి పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారింది. జహీర్, సోనాక్షి లవ్ లో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటి నుంచో కోడై కూస్తోంది. ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయి. జూన్ 23న ముంబై శివారులోని ఒక విలాసవంతమైన రిసార్ట్ లో జహీర్, సోనాక్షి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పెళ్లికి హాజరు కానున్నాయి. సోనాక్షి, జహీర్ పెళ్లి హడావుడి కూడా మొదలైంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ తమ ఫ్రెండ్స్‌తో కలిగి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పంచుకున్నారు. కాగా, వయసులో జహీర్ కంటే సోనాక్షినే పెద్దది. సోనాక్షి సిన్హా వయసు 37 ఏళ్ళు కాగా.. జహీర్ ఇక్బాల్ ఏజ్ 35 ఏళ్ళు. వీరిద్దరి మధ్య రెండేళ్లు ఏజ్ గ్యాప్ ఉంది.