ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం హీరోగానే కాకుండా ఫ్యామిలీ మెన్గానూ బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. 2023లో టీడీపీ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు రక్షిత రెడ్డిని శర్వానంద్ వివాహం చేసుకున్నాడు. పెళ్లై ఏడాది తిరక్క ముందే ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. శర్వా గారాల పట్టి పేరు లీలా దేవీ మైనేని. ఈ ఏడాది మార్చిలో తాను తండ్రి అయిన విషయాన్ని శర్వానంద్ పంచుకున్నాడు.
అయితే సందర్భం ఏంటో తెలియదు కానీ.. తాజాగా శర్వానంద్ తన గొప్ప మనసు చాటుకున్నారు. కూతురు లీలా దేవీ మైనేని పేరు మీద హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద అన్నదానం ఏర్పాటు చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. టెంపుల్ కు వచ్చిన భక్తులకు శర్వానంద్, అతని భార్య రక్షిత మరియు కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో శర్వా మంచి మనసు మరియు ఆయన సిప్లిసిటీ పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా, సినిమాల విషయానికి వస్తే.. శర్వానంద్ నుంచి ఈ ఏడాది `మనమే` మూవీ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం మాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సంపత్ నందితో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే అభిలాష్ కంకర దర్శకత్వంలో శర్వా ఒక మూవీని అనౌన్స్ చేశాడు. ఇవి రెండు కాకుండా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం చేసేందుకు కూడా శర్వానంద్ సైన్ చేశాడు.
A touching gesture by Charming Star #Sharwanand, the Father 😍🫶❤️
Actor @ImSharwanand celebrated his Daughter’s Special Day with #Annadanam at the TTD Temple in Jubilee Hills, Hyderabad, where he personally served Food ❤️ pic.twitter.com/4pGhlo3jFo
— 🖤 (@RakeShPrabhas20) December 18, 2024