సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గా `సిటాడెల్ – హనీ బన్నీ` తో నార్త్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. యాక్షన్, రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోయిన సమంత.. ఒక బిడ్డకు తల్లిగా కూడా అదరగొట్టింది.
అయితే సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన మనసులో ఉన్న షాకింగ్ కోరికను రివీల్ చేసింది. మాతృత్వం గురించి ప్రస్తావన రాగా సమంత మాట్లాడుతూ.. `నేను ఎప్పుడూ తల్లి కావాలని కలలు కన్నాను. అమ్మగా మారడానికి ఎదురు చూస్తున్నాను. మాతృత్వాన్ని కొనసాగించడానికి వయస్సు అడ్డంకి కాకూడదు, ఇది ఏ దశలోనైనా అందమైన ప్రయాణం అవుతుంది` అంటూ సమంత చెప్పుకొచ్చింది.
తల్లి కావాలని ఉందంటూ మనసులో కోరికను సమంత డైరెక్ట్ గా బయటపెట్టేసింది.
మరి తల్లి కావాలంటే పెళ్లి చేసుకోవాలి. మరి సమంత రెండో వివాహం చేసుకుంటుందా..? లేదా..? అన్నది చూడాలి. కాగా, 2017లో అక్కినేని నాగచైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరి బంధం ఎక్కువకాలం సాగలేదు. వ్యక్తిగత విభేదాలతో పెళ్లైన నాలుగేళ్లకే చైతు, సామ్ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం చైతు శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడు. త్వరలోనే ఈ జంట మూడు ముళ్లబంధంతో ఒకటి కాబోతున్నారు.