ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం.. పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ 11 స్థానాలకు దిగజారిపోయింది. వైసీపీ ఇంతగా ఓడిపోవడానికి గత కారణాలపై అనేక విశ్లేషణలు వచ్చాయి. వీటిలో ఎక్కువ మంది.. అప్పటి ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వైపు వేళ్లు చూపించారు. ఏ పనికోసం వెళ్లినా.. ముందు ఆయనను కలుసుకుని.. వివరణ ఇవ్వాల్సి వచ్చేదని చాలా మంది నాయకులు చెప్పారు.
పోనీ.. అంత వివరించినా చివరికి ఆ పని అయ్యేది కాదని.. కనీసం జగన్‌ను కలిసేందుకు కూడా సజ్జల అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని దీంతో పార్టీలో అంతా ఆయనే సర్వస్వం అన్నట్టుగా మారిపోయి.. నష్ట పోయామని పలువురు చెప్పారు. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు.. ఏ పార్టీలో అయినా.. ఆ నాయకుడిని తీసి పక్కన పెడతారు. ప్రాధాన్యం తగ్గిస్తారు. తప్పులు సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు.
కానీ, సజ్జల విషయంలో జగన్ మాత్రం ఇంకా తెలుసుకోలేక పోతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతు న్నారు. పార్టీపరంగా ప్రస్తుతం బలమైన వాదన వినిపించే వారు కావాలి. ప్రత్యర్థి పార్టీలకు బలమైన సమా ధానం చెప్పే వారు కూడా కావాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియాలో జరిగే చర్చలకు ఎవరెవరిని పంపించాలనే విషయంపై వైసీపీ దృష్టి పెట్టి 12 మందితో కూడిన జాబితాను అనుకూల మీడియా చానెళ్ల కు పంపించింది.
అయితే.. ఈ వ్యవహారం ఇప్పుడు రగడకు దారితీసింది. ఈ ప్యానెల్లో సజ్జలను విమర్శించేవారిని పక్కన పెట్టారు. అంటే.. ఇప్పటి వరకు ఉన్న జాబితాలో ఒకరిద్దరు.. భజన మానేసి.. వాస్తవాలు చెప్పడం ప్రారం భించారు. సజ్జల సహా సలహాదారుల వల్ల ఒరిగింది ఏముందని.. టీవీ చర్చల్లో అందరూ కాకపోయినా.. ఒకరిద్దరు నిజాలు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు వీరిని పక్కన పెట్టి.. కొత్తవారితో ప్యానెల్‌ను పంపించా రు.
ఇది పార్టీ పరంగా సొంత నిర్ణయం కాదని.. సజ్జల నిర్ణయమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంత ఓటమి అనుభవం ఎదురొచ్చినా.. పార్టీ అధినేత తీరు ఏమాత్రం మారలేదన్నది ..తాజాగా వైసీపీనాయకులు చెబుతున్న మాట. ఇంకా సజ్జల పెత్తనమే సాగుతోందని అంటున్నారు.