T Raja Singh has tremendous following, it seems. https://t.co/b74g0ffqFM
— Abhijit Majumder (@abhijitmajumder) August 25, 2022
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి.. తెలంగాణలో కొత్త కలకలాన్ని.. హైదరాబాద్ మహానగరంలో ఉలికిపాటుకు గురి చేయటమే కాదు.. చాలా ఏళ్ల తర్వాత ఉద్రిక్త వాతావరణాన్ని పాతబస్తీలో తీసుకొచ్చిన ఘనత బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పీడీ యాక్టు కింద కేసు పెట్టి.. న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లకుండానే చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. తనపై పీడీ యాక్టు కేసు పెట్టనున్న విషయాన్ని కాస్త ముందే గుర్తించిన రాజాసింగ్.. తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా ఆయన మొత్తం మూడు నిమిషాల నిడివి ఉన్న రెండు వీడియోల్ని (ఒకటి రెండు నిమిషాలు.. రెండోది నిమిషం కంటే కాస్త ఎక్కువ నిడివి) విడుదల చేసిన రాజాసింగ్ తన వాదనను వినిపించే ప్రయత్నం చేశారు.
తాను ఏ దేవుడిని దూషించలేదని.. తన పది నిమిషాల వీడియోను చూసి చెప్పాలన్నారు. ఒక వ్యక్తి చరిత్ర చెబితే తమ దేవుడిని దూషించారని ఒక వర్గం వారుతనపై నిందలు వేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో నిర్వహించదలచిన మునావర్ షో న పెట్టొద్దని రిక్వెస్టు చేశానని.. అయినా వినలేదని చెప్పారు.
అందుకే తాను ఆగస్టు 22న నా షో ఉంటుందని చెప్పా. అందులో ఒక వ్యక్తి గురించి చెప్పా. దాంతో కొందరు తమ దేవుడిని దూషిస్తున్నారని కేసులు పెడుతున్నారు. ఈ మొత్తంతప్పునకు కారణం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు. ఇదంతా అసదుద్దీన్ ఓవైసీ చేయిస్తారని.. ముందు ఆయన్ను అరెస్టు చేయాలన్నారు. గతంలో అక్బరుద్దీన్ ఒక వర్గం దేవుళ్లపై పరుషంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదు.
ఇప్పుడు నా మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నారు. అప్పుడు అక్బరుద్దీన్ ఒక వర్గం దేవుళ్లపై పరుషంగా.. .ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. అనర్హత వేటు వేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్.. మజ్లిస్ లు కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.
తనపై కొందరు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. వారిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పోలీసులు సైతం మజ్లిస్ కు వత్తాసు పలుకుతున్నారని.. తనను అరెస్టుచేసి.. జైలుకు పంపించినా.. ధర్మం కోసం తాను అన్నింటికి సిద్ధంగా ఉంటానని వ్యాఖ్యానించారు.
Telangana needs @TigerRajaSingh as CM. Another Yogi in the making. pic.twitter.com/9LvfZISPJh
— Abhijit Majumder (@abhijitmajumder) August 25, 2022