ఈ మధ్య సెల్లె సింధమ్మ టోక్యో నుండి ‘బ్రాంజ్ మెడల్’ తో తిరిగి వచ్చాక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది .ఆ పదిహేను నిముషాల ఇంటర్వ్యూ లో సెల్లె బోల్డన్ని విషయాలు చెప్పింది.అవి విన్నాక నాకు….. సింధు పుట్టగానే జన్మ జన్మ బంధాలు వున్న కొరియా కోచ్ ‘పార్క్’, హైదరాబాద్ సుచిత్ర అకాడమి ‘శ్రీకాంత్’ ఒకే మాట అనుకుని ‘గచ్చి బౌలి’ కి వచ్చి ఆవిడకి ట్రైనింగ్ స్టార్ట్ చేసారేమో అన్నంత కంగారు వచ్చింది!
2004 నుండి 2020 మార్చ్ వరకు గోపీచంద్ దగ్గర,ఆయన అకాడమీ లో(2001 లో గోపి ‘ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్’ గెలవడమే తన ఇన్స్పిరేషన్ గా చెప్పుకునే సింధు) ఓనమాలు నేర్చుకున్న విషయం,ఆ కోచ్ సారధ్యంలోనే వరల్డ్ నెంబర్ 2 గా మారిన విషయం,ఆ కోచ్ సారధ్యం లోనే ‘2016 రియో ఒలింపిక్స్’ లో ‘సిల్వర్ మెడల్’ సాధించిన విషయం కన్వీనియంట్ గా మర్చి పోయి,కొత్త కోచ్ ని ఆకాశానికి ఎత్తుతున్న విషయం చూస్తుంటే రాజకీయాలే కాదు ఆటలు కూడా ఎంత ‘కృతఘ్నత’ గా మారిపో యాయో తెలవడం తో తెలుగు జనాలు ఒక్కసారిగా బిత్తర పోయారు.2016 రియో ఒలింపిక్స్ నుండి వచ్చాక సింధు ,ఆమె తండ్రి ‘గోపి అకాడమీ ని ,గోపి కోచింగ్ ని’ ఎంత పొగిడారో గుర్తు చేసుకుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది. కేవలం ఒక్క ఏడాది కోచింగ్ పార్క్ దగ్గర తీసుకున్న దానికే ఆవిడ తన ఘనత ని ఆయనకీ కట్టబెట్టడం లో చూపిస్తున్న వుత్సుకత భలే కామెడీ గా వుంది.
నిజానికి వర్క్ లోడ్ తగ్గించుకునేందుకు గోపి 2019 మార్చ్ లో ‘కిమ్ జి హ్యున్’ అనే లేడీ కోచ్ దగ్గర తన అకాడమీ లోని విమెన్ షట్లర్స్ ని ట్రైనింగ్ ఇప్పించడం స్టార్ట్ చేసాడు. ఆమె దగ్గర కోచింగ్ లో ఉన్నప్పుడే ‘BWF వరల్డ్ చా౦పియన్ షిప్’ గెలిచింది.కానీ ఎక్కడా తన కోచ్ గురించి చెప్పింది లేదు.ఆవిడ భర్త అనారోగ్యం కారణంగా సెప్టెంబర్,19 లో ట్రైనింగ్ టీం నుండి కొరియా వెళ్లిపోయింది.గోపి అకాడమీ లోనే మొదట మెన్స్ కి కోచింగ్ ఇస్తున్న ‘పార్క్ టీ సంగ్’ దగ్గర ఒక ఏడాది నుండి,గోపి అకాడమీ నుండి బయటకి వచ్చి గచ్చి బౌలి లో ఇండోరు స్టేడియం లో ప్రాక్టీసు ఆవిడ చేస్తుంది.ప్రాక్టీసు పార్టనర్స్ గా ‘సుచిత్ర అకాడమీ’ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు.పార్క్ కి ఆసియ ఛా0పియన్ షిప్ లో ‘బ్రాంజ్’ గెలిచిన అనుభవం తప్ప మరేమీ లేదు.2004 ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కన్నా ముందే ఓడాడు.
2004 లో కోచింగ్ మొదలుపెట్టి, 2008 లో నానా కష్టాలకి ఓర్చి,ఇల్లు తాకట్టు పెట్టి,అకాడమీ పెట్టి తల్లి , భార్య తో కలిసి 24/7 అకాడమీ లోనే వుండి, బాడ్మింటన్ కి ‘వరల్డ్ క్లాసు ఫెసిలిటీస్’ కల్పించి,చైనా కి దీటుగా ప్లేయర్స్(60 మంది తో నడుస్తున్నది ,ఏడాది కి 2 కోట్ల ఖర్చు) ని తయారు చేస్తు నిశ్సబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతూ వుంటే….. అక్కడే బేసిక్స్ నేర్చుకుని,వరల్డ్ నెంబర్ 2 స్థాయి కి అక్కడే ఎదిగి,సిల్వర్ మెడల్ అక్కడే సాధించి ..చివరకి ’గోపి సర్ పాత్ర ఏమీ లేదు ఈ మెడల్ సాధన లో’ అని అనే స్థాయికి వెళ్లి గురువుకి పంగనామాలు పెడుతున్నవంటే నిన్ను ఏమనాలి? ఇంతకీ నీ ‘కొత్త కోచ్’ వల్ల నువ్వు సాధించినది ‘కంచు పతకం’ మాత్రమే కదా?నీ వరల్డ్ ర్యాంకింగ్ ఇప్పుడు 7.ఆటలో నువ్వు ‘గోపి అకాడమీ’ నుండి బయటకి వచ్చి ఎదిగావా ?దిగ జారావా? ’2nd రాంక్ , సిల్వర్మెడల్’ నుండి …’7th రాంక్,బ్రాంజ్’ కి వచ్చావంటే అదేమన్నా గొప్ప ఘనతనా..నీ పాత ఘనత లతో పోలిస్తే?
కోచింగ్ లో భాగంగా చీఫ్ కోచ్ గా ఏర్పాటు చేసిన కోచ్ ల తోనే అకాడమీ లోనే కోచింగ్ తీసుకుంటూ 2019 వరకు వుండి, ఇప్పుడు కొత్తగా ఒక మెడల్ రాగానే ఇక్కడి దాకా తెచ్చిన పాత కోచ్ ని, అకాడమీ ని కనీసo తలచుకోడానికి కూడా ఇష్టపడక పోవడం అనేది దేనికి సంకేతం?పునాది ని మర్చిపోయి ఎంత ఎగిరితే అంత కిందకి పాతాళం లోకి పడడం మినహా సాధించేది ఏమీ ఉండదు? సైనా ని చూసి నేర్చు కోకపోతే ఎవరు మాత్రం ఏమి చేయగలరు?(2016 లో సైనా ఇలానే ‘సింధు’ మీద ఫోకస్ ఎక్కువ పెట్టారు అని బెంగళూరు లో విమల్ కుమార్ అకాడమీ కి వెళ్లి, 2017లో వెనక్కి వచ్చింది). అందరి మీద ఫోకస్ చేయడం కష్టమే అనే భావన తోనే గోపి కొంత మంది విదేశీ కోచ్ లతో శిక్షణ ఇప్పించడం మొదలు పెట్టింది.
నీరజ్ చోప్రా ని చూసి నేర్చుకో ..తన చిన్నప్పటి కోచ్,ఇన్స్పిరేషన్ అయిన ‘జై వీర్’ నుండి మొదలుపెట్టి ‘నసీం అహ్మద్, బర్తోనిజ్ ,గారి కల్వర్ట్, డానియెల్స్ ,కాశీనాద్ నాయక్’ వరకు తన ఎదుగుదల కి వివిధ స్థాయిల్లో సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు మెడల్ గెలిచాక .2020 జనవరి లో తనని వదిలి వెళ్ళిన ప్రధాన జర్మన్ కోచ్, లెజెండ్ ‘వువ్ హోన్’ ని గుర్తు చేసుకున్నాడు.7 నెలల కిందట తనని వదిలి వెళ్ళిన కోచ్ పాత్ర ఏమీ లేదు ఈ మెడల్ విన్నింగ్ లో అని అనలేదు. సీనియర్ లాంగ్ జంపర్ ‘అంజు బాబి జార్జ్’ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ‘మీ లాంటి సీనియర్స్ వేసిన అడుగు జాడల వలెనే ఈరోజు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఈ మెడల్ గెలుచుకున్నాను’ అని వినమ్రంగా చెప్పాడు.అంతే గాని సింధు మాట్లాడినట్టు ‘సైనా నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు అని సీనియర్ ని తక్కువ చేసో,గోపి మెసేజ్ చేసారు,ఫోన్ చేయలేదు అని గురువు ని బయటే సేట్లు మాట్లాడ లేదు.
CMని కలిసి వస్తూ’ ఆంధ్ర లో 2% రిజర్వేషన్ స్పోర్ట్స్ కి ఇస్తున్న CM గారికి థాంక్స్’ అని చిలక పలుకులు వల్లిoచడం మరీ పిచ్చ కామెడీ గా వుంది.ఆ GO No:13 ఇచ్చింది 23/01/2018 న గత ప్రభుత్వం.A.PS.S.S.R,1996 లో రూల్ 22(2)(D)(E) కి సవరణ చేస్తూ 100 రోస్టర్ పాయింట్స్ లో 48,98 పాయింట్స్ ని స్పోర్ట్స్ లో DR కోటా కి కేటాయించింది.
ఒకప్పుడు ‘కోనేరు హంపి’ ఇలానే తన తండ్రి ‘అశోక్’ ని తప్ప వేరే ఎవరినీ తనకి ‘చెస్ కోచ్’ గా ఒప్పుకునేది కాదు..చాలా కాలం వరకు. ఆమె అందుకే మొదటి స్థానం ఈనాటికి సాధించలేదు.తండ్రి పాత్ర ‘ఆట’ లో వుండకూడదు.అతన ఎంత ‘స్పోర్ట్స్ పర్సన్’ అయినా తనకు సంబంధం లేని స్పోర్ట్స్ లో వేలు పెట్టకూడదు .తను అందులోనే ఆటగాడే అయినా ‘ఇంటర్నేషనల్ కోచింగ్’ లో అనుభవం లేనప్పుడు ఎక్కువ దూర కూడదు.
కేవలం ‘నైతిక మద్దతు’ మాత్రమే ఇవ్వాలి ..సైనా తండ్రి లాగ. కోచ్ ల మీద,వారి కోచింగ్ పద్ధతుల మీద కామెంట్స్ చెయ్యకూడదు. మూడో వ్యక్తి ప్రమేయం ఎక్కువ అయితే ఆట లో‘తిరోగమనం’ ప్రారంభం అవుతుంది…. ఈవిషయం ఎంత త్వరగా గమనిస్తే ఆమెకి అంత మంచిది. అంతా బాగున్నప్పుడు ‘ఇలాటివి’ పెద్దగ గుర్తించరు. తేడా వచ్చినప్పుడు ఇవే పెద్ద విషయాలు అవుతాయి.సింధు,ఆమె తండ్రి రమణ ఇవి గుర్తించు కుంటే మంచిది.మర్చిపోతే ఆవిడకి అదే ‘లాస్ట్ మెడల్ మాచ్’ అవుతుంది.
PS: ఆంధ్ర CM ని ఎంత పొగిడినా 30 లక్షల చెక్కు, వైజాగ్ తుప్పల్లో వున్నట్లు పేపర్ మీద చూపే స్థలం తప్ప ఇంకేమీ దొరకదు.రాలదు. ఎందుకంటే నువ్వు ‘అడుగు’ ఎక్కువ ఎత్తు ఉన్నావు బుడ్డరెడ్డి కన్నా! ఆ చెక్ కూడా ఎప్పుడు పాస్ అవుతుందో ఎవడూ చెప్పలేడు.
గోపీ శిష్యుల బొటనవేలు ని గురుదక్షిణ గా అడిగే ‘ద్రోణుడు’ కాదు!! శిష్యుల మంచి సదా కోరుకునే ‘బలరాముడు’ లాంటి వాడు!
#పాకాల_పరిశుద్ధరావు