న్యాచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ నుంచి వచ్చిన తాజా చిత్రం `కోర్ట్`. ప్రియదర్శి పులికొండ, శివాజీ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించిన లీగల్ డ్రామా ఇది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు. కోర్ట్ మూవీని హీరో నాని గట్టిగా ప్రమోట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘కోర్ట్’ నచ్చకపోతే తన రాబోయే చిత్రం `హిట్ 3` చూడొద్దంటూ స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు. దాంతో ‘కోర్ట్’ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది.
అందుకు తగ్గట్లుగానే మార్చి 14న విడుదలైన ‘కోర్ట్’ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కథా నేపథ్యం, ఫస్టాఫ్ లో హర్ష్ రోషన్-శ్రీదేవి మధ్య సాగే లవ్ స్టోరీ, కథలోని శివాజీ పాత్ర, విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఆయువుపట్టుగా మారాయి.
25 ఏళ్లుగా మంగపతి వంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని శివాజీ అన్నారు. ఆయన అన్నట్లుగానే శివాజీ కెరీర్ లో ఈ చిత్రంలోని మంగపతి పాత్ర టాప్ ప్లేస్ లో ఉంటుంది. ‘మంగపతి’ పాత్ర తన కోసమే పుట్టిందని తాను భావిస్తున్నానని శివాజీ చెప్పారు. ఈ పాత్రతో తన పాతికేళ్ల కల నెరవేరిందని అన్నారు. నటుడిగా నిరూపించుకున్న నాని… ఇప్పుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నారని కితాబునిచ్చారు.
టాక్ బాగుండటంతో ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కుమ్మేస్తుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట కూడా పట్టింది. 2 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో రూ. 5.56 కోట్ల షేర్, రూ. 10.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ‘కోర్ట్’ మూవీ సొంతం చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 8.01 కోట్ల షేర్, రూ. 15.30 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లు. అయితే ఈ టార్గెట్ ను దాటేసి ప్రస్తుతం ‘కోర్ట్’ మూవీ రూ. 1.01 కోట్ల లాభాలతో ముందుకు సాగుతోంది.
అంతేకాదు, అమెరికాలోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనో 505k డాలర్లు కొల్లగొట్టింది.