మలయాళ స్టార్ హీరో, నిర్మాత ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయాలు అక్కర్లేదు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన `పుష్ప` మూవీతో ఫహాద్ ఫాజిల్ తెలుగు వారికి ఎంతగానో చేరవయ్యారు. ఈ సినిమాలో భన్వర్‌సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహాద్ అదరగొట్టారు. తనదైన యాక్టింగ్ మరియు బాడీ ల్యాంగ్వేజ్ తో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అయితే తాజాగా ఫహాద్ ఫాజిల్ గురించి ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది.
`రాజారాణి` సినిమా ద్వారా సైత్ ఇండస్ట్రీలో భారీ స్టార్డమ్ సంపాదించుకున్న నజ్రియా.. `అంటే సుందరానికి` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇటీవల నజ్రియా నటించిన `సూక్ష్మదర్శిని` సూపర్ డూపర్ హిట్ అయింది. ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నజ్రియా.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకుంది.
ఇంటర్వ్యూలో తన భర్త ఫహాద్ ఫాజిల్ కు ఒక అరుదైన వ్యాధి ఉన్న విషయాన్ని నజ్రియా బయటపెట్టింది. గత కొన్ని నెలల నుంచి ఏడీహెచ్‌డీ తో ఫహాద్ బాధపడుతున్నాడట. ఈ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ చికాకును కలిగి ఉంటారట. ఎక్కువసేపు ఏ విషయంపై శ్రద్ధ పెట్టకపోవడం, పరధ్యానంలో ఉండటం, తొందరగా ఆవేశ పడటం ఏడీహెచ్‌డీ వ్యాధి లక్షణాలని నజ్రియా వివరించింది. ఇక ఫహాద్ వ్యక్తిత్వ లక్షణాలకు చాలా కాలంగా తాను అలవాటు పడ్డానని నజ్రియా చెప్పుకొచ్చింది.