శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ శత జయంతి వేడుక కన్నుల పండుగా ఎన్టీఆర్ అభిమానులు తెలుగు దేశం శ్రేణులు ఘనంగా ఒక పండగ వాతావరణము లో జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి స్వదేశం నుండి ముఖ్య అతిధిగా శ్రీ నారా రోహిత్ గారు మరియి శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారు ముఖ్య అతిధులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు
….ఈ కార్యక్రం జ్యోతి ప్రజ్వలన తో మొదలైంది….
తెలుగు దేశం బహ్రెయిన్ అధ్యక్షులు శ్రీ రఘునాధ్ బాబు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతికి గర్వకారణమైన ఒక మహాపురుషుడు మరియు తర తరాలను తన్మయం చేయగల కారణజన్ముడు, చిరస్మరణీయుడు అని కొనియాడారు.
అలాగే నారా రోహిత్ గారు మరియు గుమ్మడి గోపాల కృష్ణ గారు తెలుగు దేశం ని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని మనం అందరం కలిసి సహకరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు.
శ్రీ శివ కుమార్ గారు, శ్రీ హరిబాబు గారు, శ్రీ మురళీకృష్ణ గారు, శ్రీ రాజశేఖర్ గారు, శ్రీ గోపాల్ చౌదరి గారు మరియు అనేకమంది వక్తలు నేతలు ఎన్టీఆర్ గారిని, వారు తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడుతూ , ఎన్టీఆర్ ని ఒక గొప్ప నాయకుడుగా, గొప్ప కళాకారుడు గా తెలుగు వారి ఆరాధ్య దైవంగా తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక మహాపురుషుడు గా వర్ణించారు.
కార్యక్రం ఆద్యంతం ఆట పాట లు తో ఒక్కో పాత్ర సభికులు ఉత్సాహ పరిచింది.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో ప్రవాసాంధ్రులు దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గున్నారు..
మహానాడు జ్ఞాపికగా కేక్ కట్ చేసి ముగించారు.
జై తెలుగుదేశం జై మహానాడు.