అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిని పరామర్శించడానికి ‘యాష్ బొద్దులూరి’ ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగగానే, నియంత జగన్ రెడ్డి ప్రభుత్వం కాపుకాసి అరెస్ట్ చేసి మంగళగిరి కు తరలించడాన్నిఅమెరికా టీడీపీ ఎన్నారై నేత ‘జయరాం కోమటి’ తీవ్రంగా ఖండించారు.
చివరి వంద రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమో అని భావించిన ప్రవాసాంధ్రుల ఆశలను వమ్ము చేస్తూ, తన సైకో బుద్దిని కొనసాగిస్తూ, ‘యాష్ బొద్దులూరి’ ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అమెరికాలోని ఎన్నారైలు ముక్త కంఠం తో ఖండిస్తున్నారని అన్నారు.
వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ అన్ని నగరాలలో నిరసనలకు పిలుపునిచ్చారు.