జగన్ సర్కారు పవన్ అంటే ఎందుకు అంత భయపడుతుందో పవన్ కి కూడా అర్థం కాదేమో. పవన్ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ జగన్ సర్కారు వాడేసుకుంటోంది.
సరే బలమైన ప్రతిపక్షం కాబట్టి టీడీపీకి భయపడుతుందంటే ఓకే అనుకోవచ్చు. ఒకవైపు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేదు అని వ్యంగం చేస్తూనే పవన్ అంటే జగన్ రెడ్డికి చలిజ్వరం వస్తోంది.
పవన్ బర్త్ డే వస్తోందని… ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలను బ్యాన్ చేసి పడేశాడు జగన్ రెడ్డి. అది కూడా జస్ట్ 3 రోజుల క్రితమే. అది కూడా ఆరోజు నుంచే అమలు అనే శాడు.
కట్ చేస్తే సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లాగే కేవలం పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా అలాంటిదే అంటున్నారు అందరూ.
చివరకు జగన్ స్ట్రాటజీ వీధిలో ఫ్లెక్సీలు ముద్రించేవాడికి కూడా అర్థమైపోవడంతో కొద్దిరోజులే కదా అని కనీసం నిరసన కూడా తెలపకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఎలాగూ పవన్ బర్త్ డే అయిపోతే బ్యాన్ ఎత్తేస్తారనీ వారికీ తెలుసు కదా.
అక్కడి దాకా ఎందుకు పవన్ కి మాత్రమే ప్లాస్టిక్ బ్యాన్ అని వైసీపీయే అధికారికంగా నిరూపించేసింది. ఈరోజు రేపు ఏపీలో జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా సమావేశాల్లో భాగంగా భారీ ప్లాస్టిక్ ఫ్లెక్సీ హ్యాపీగా కట్టేశారు. దానిని తొలగించే ధైర్యం ఏ పోలీసుకు ఉంది. తొలగిస్తే డాక్టర్ సుధాకర్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది అని పోలీసులకు మాత్రం తెలియదా ఏంటి…. ?
నీతులు చెప్పడానికే వైసీపీ…. పాటించడానికి కాదు.. అన్నట్టుంది వారి పరిస్థితి.