పాపం ఒకపుడు కేసీఆర్ దర్శనం ఒక అద్రుష్టం అన్నట్టుండేది తెలంగాణలో. కానీ కేసీఆర్ ఫోన్లు చేసి పిలుస్తున్నా పలికేవాడే లేడాయె. లోక్ సభ టిక్కెట్లు పిలిచి ఇస్తుంటే తీసుకునేవాడు కరవయ్యాడు బీఆర్ఎస్ పార్టీలో. కేసీఆర్ బలం అధికారం ఉన్నపుడు ఆయన పార్టీ నేతలకు మొహం చాటేశాడు.
ఇపుడు కేసీఆర్ (KCR) కి అధికారం పోయాక నేతలు కేసీఆర్ కి మొహం చాటేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు టీఆర్ఎస్ టికెట్ కోసం అందరూ పోటీ పడ్డారు. కేసీఆర్ ఎవరితోనూ కలవరు. ఇప్పుడు కేసీఆర్ నేతలను కలవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా పోటీ చేయమని చెప్పడంతో వారు రావడం లేదని పార్టీలో కీలక నేతలు ఆంతరంగికంగా వాపోతున్నారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒక టిక్కెట్ కోసం పది మంది పోటీ పడుతున్నారు. బీజేపీకి మోడీ బలం, కాంగ్రెస్ కి రేవంత్ బలం అన్నట్టుంది పరిస్థితి. పైనా కిందా అధికారంలో లేని కేసీఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తే బూడిదే మిగిలేది … ఎన్నికల ఖర్చంతా వేస్టని కేసీఆర్ ను కలవడానికే నేతలు వెనుకడుగు వేస్తున్నారు.