ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇక ఏపీలోని కొన్ని చోట్ల ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రగిరి, పల్నాడు ప్రాంతాల్లో వైసిపి అలాగే టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ఇలాంటి నేపథ్యంలో… కూటమి లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈసారి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది కూటమి.
ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో… ఓటమి విజయం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు. ఈసారి 81 కి పైగా ఓటింగ్ శాతం ఏపీలో నమోదు అయింది. అంటే గతం లో కంటే రెండు శాతం ఎక్కువ నమోదు అయినట్లు. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు అయిపోతే… అది ప్రతిపక్ష పార్టీలకు ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. 2014 సంవత్సరంలో ఇదే కూటమి పోటీ చేస్తే 104 సీట్లు వచ్చాయి. అప్పటి పరిస్థితులు వేరు… ఇప్పటి పరిస్థితుల్లో వేరు.
అయితే ఇప్పుడు వైసీపీ పార్టీపై ఏపీ ప్రజల్లో తీవ్రమైన కోపం ఉందని…. గ్రౌండ్ స్థాయిలో రిపోర్టు వచ్చింది. అంటే వైసిపికి వ్యతిరేకంగా… ఓటు వేసే వారి శాతం విపరీతంగా పెరిగింది అన్నమాట. అయితే ఇలాంటి వేవ్ లో తెలుగుదేశం కూటమికి.. దాదాపు 140 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు కూటమి సభ్యులు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎన్నికల పోలింగ్ పూర్తిగా గానే.. ఓటమికి సాకులు చెప్పుకుంటున్నారు వైసిపి నేతలు.
రిగ్గింగ్ చేశారని కొందరు చెబుతుంటే.. ఎన్నికల అధికారులు నిద్రపోయారని మరికొంతమంది వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు… ఏపీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే… అమరావతి నుంచి ప్రమాణ స్వీకారం ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీనీ… తీసుకురాబోతున్నారట. దేశ ప్రధానిగా మూడోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… ఏపీకి ఆయనను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి సభ్యులు. ఇక ఇదంతా జరగాలంటే జూన్ 4వ తేదీ వరకు అందరూ ఆగాల్సిందే.