మొహాలీలోని చంఢీఘర్ యూనివర్సిటీలో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 60 మంది విద్యార్థినుల నగ్న వీడియోలు పో.ర్న్. సైట్లలో అప్ లోడ్ అయినట్లు వదంతులు వ్యాపించడంతో విద్యార్థినులు యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు.
60 మంది అమ్మాయిల వీడియోలు అనేటప్పటికి దేశం ఉలిక్కిపడింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కూడా రంగంలోకి దిగారు. వెంటనే దీనిపై ఒక ప్రాథమిక విచారణకు ఆదేశించారు. అనంతరం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
60 మంది యువతుల్లో 8 మంది ఆత్మహత్యయత్నం చేసి ఆస్పత్రి పాలైనట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, అదేదీ నిజం కాదని పోలీసులు తేల్చారు.
కేవలం ఒక మ్మాయి తన నగ్న వీడియోను తానే తీసుకుని తన ప్రేమికుడికి పంపితే అది అతను పో.ర్న్. సైట్లోకి అప్ లోడ్ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ అమ్మాయిని విచారించిన అనంతరం ఏ యువతి వీడియోను తాను చిత్రీకరించలేదని ఆ విద్యార్థిని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
వదంతులు నమ్మవద్దని, మన ఆడపిల్లలకు ఏమీ జరగలేదని, ఏమీ ప్రమాదం లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు భరోసా ఇచ్చారు. మొత్తానికి ఈ మొహాలీ యూనివర్సిటీ ఉదంతం దేశాన్ని కుదిపేస్తోంది.
"अब तक के जांच में यह सामने आया कि जो वीडियो है वह सिर्फ लड़की की है… उसके अलावा किसी की भी वीडियो नहीं है…. Phone को भी Custody में ले लिया गया है": Mohali SP#chandigarhuniversity #Chandigarh pic.twitter.com/BNyR2rJMm7
— News24 (@news24tvchannel) September 18, 2022