ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసినా చాలా దూరదృష్టితో ఆలోచించే చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని అయ్యేవరకు కూడా ఆయన గ్రాఫ్‌ను పరిశీలిస్తే.. చాలా వ్యూహాత్మక అడుగులే వేశారు. అలాంటి నాయకుడు.. ఎవరిని కోరుకుంటారంటే.. తనలాగే ఆలోచించే నాయకులను కోరుకుంటారు. ఈ క్రమంలోనే 2014లో కోరి కోరి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబును భుజాలకుఎత్తుకున్నారు.
కట్ చేస్తే.. ఈ 9 ఏళ్లకాలంలో(కేంద్రంలో మోడీ కొలువుదీరిన సమయం) ఎన్డీయే మిత్రపక్షాలతో ఆయనకు అవసరం లేకుండా పోయింది. దీంతో ఎవరినీ కూడా మోడీ పట్టించుకోలేదు. మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చినప్పుడు పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎన్డీయేకు గుడ్బైచెప్పినా.. మోడీ స్పందించ లేదు. సొంత నేతలు కూడా పార్టీకి దూరమైనా ఆయన పట్టించుకోలేదు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు మాత్రం ఎన్డీయే మిత్రపక్షాలను ఎన్నికలకు ఏడాది ముందే రెడీ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి పక్ష పార్టీలతో నరేంద్ర మోడీ నేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి చిత్రంగా చిన్నా చితకా పార్టీలు.. అసలు పార్లమెంటులో ప్రాతినిధ్యం లేని(చిరాగ్ పాశ్వాన్, జనసేన వంటి వి) పార్టీలను కూడా ఆహ్వానించారు. కానీ, ఎటొచ్చీ.. టీడీపీ వంటి బలమైన మిత్రపక్షాన్ని మాత్రం పిలవలేదు. నిజానికి చెప్పాలంటే.. ఎన్డీయే ఏర్పాటుకు 1990లో టీడీపీనే పునాదులు వేసింది.
ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు దేశంమొత్తం తిరిగి.. ఎంతో కృషి చేశారు. అలాంటి బాబును ఇప్పుడు మోడీ ఆహ్వానించలేదు. మరి దీని వెనుక ఉద్దేశం ఏంటి? వ్యూహం ఏదైనా ఉందా? అంటే.. ఉందనే అంటున్నారు పరిశీలకులు. వయసులో తనతో సమకాలికుడు అయిన చంద్రబాబు కు కూడా చాలా విజన్(దూరదృష్టి) ఉన్న నాయకుడిగా పేరుంది.
ఈ నేపథ్యంలో ఆయన వల్ల.. తన ప్రచారం ఏమైనా దెబ్బతింటుందేమో అనే సందేహం ఉండి ఉండొచ్చ ని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయేతో చేతులు కలిపిన పార్టీలకు ప్రత్యేక ఆకాంక్షలు ఏమీలేదు. అందుకే మోడీని నాయకుడని అనేశారు. అయితే.. ఈ పరిస్థితి చంద్రబాబు దగ్గర ఉంటుందో ఉండదో అనే సందేహం ఉంది. అదేసమయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా.. నేనే చెప్పాను అని చంద్రబాబు తరచుగా అనేవారు. ఇది కూడా కొంత ఎఫెక్టే అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నా రు. ఇంతకు మించి టీడీపీని వద్దను కునే పరిస్థితి ఉండదని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.