ఈ మధ్య తెలుగులో మలయాళ అనువాదాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. గత నెలలో ప్రేమలు, భ్రమయుగం చిత్రాలు మన ప్రేక్షకులను అలరిస్తే.. ఈ నెలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ థియేటర్లలో బాగా సందడి చేస్తోంది. గత వారం విడుదలైన ఈ అనువాద చిత్రానికి తెలుగులో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ టాక్, రివ్యూలు రావడంతో సినిమాకు తొలి వీకెండ్లో మంచి వసూళ్లు వచ్చాయి.
రెండో వారంలో కూడా మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోందీ చిత్
‘మంజుమ్మల్ బాయ్స్’ ఒరిజినల్ ప్రొడ్యూసర్లతో పీవీఆర్ వాళ్లకు ఏదో గొడవ నడుస్తోందట. దీంతో దేశవ్యాప్తంగా ‘మంజుమ్మల్ బాయ్స్’ షోలు ఆపేయాలని పీవీఆర్ యాజమాన్యం నిర్ణయించింది. ఐతే తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. మలయాళ నిర్మాతలతో వివాదం ఉంటే ఆ భాషలో సినిమాను ఆపేయాలి కానీ.. తాము రిలీజ్ చేసిన సినిమాకు ఇక్కడ షోలు ఎలా నిలిపి వేస్తారని మైత్రీ వాళ్లు అంటున్నారు.
ఆ సంస్థ అధినేతలు పీవీఆర్ వాళ్లతో మాట్లాడినా లాభం లేకపోయిందని తెలుస్తోంది. దీంతో వ్యవహారం తెలుగు ఫిలిం ఛాంబర్ వద్దకు వెళ్లింది. బాగా ఆడుతున్న సినిమాకు ఇలా అర్ధంతరంగా షోలు ఆపేస్తే తమకు నష్టం వస్తుందంటూ అక్కడ మైత్రీ వాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు సాయంత్రం పీవీఆర్ ప్రతినిధులతో ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయబోతోంది.