మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. త్వరలోనే టీడీపీలోకి చేరనున్నారు. ఆయనకు గుంటూరు పార్లమెం టు స్థానం ఇచ్చే ఆలోచనలోనూ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరుకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి ఒకరు.. హైదరాబాద్లో చంద్రబాబు దూతగా లగడపాటిని కలిసివచ్చార ని తెలిసింది. గతంలో విజయవాడ నుంచి 2004, 2009 ఎన్నికల్లో లగడపాటి విజయం అందుకున్నారు.
కానీ, ఇప్పుడు విజయవాడ కన్నా గుంటూరు అయితే బెటర్ అని భావిస్తున్న లగడపాటి.. దానికి అనుగు ణంగానే అడుగులు వేస్తున్న టీడీపీలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో లగడపాటిని తీసుకురావడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇక, ఆర్థికంగాను, రాజకీయంగాను లగడపాటికి తిరుగులేదన్న విషయం కూడా తెలిసిందే.
దీంతో టీడీపీ ఆయనను చేర్చుకునేందుకు ముహూర్తం కూడా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. జనవరి తొలివారంలోనే లగడపాటి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ వెంటనే ఆయన గుంటూరులో పర్యటించనున్నారని సమాచారం. ఇక్కడ గుంటూరులో కేవలం తన నియోజకవర్గం మాత్రమే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీని గెలిపించే బాధ్యతను లగడపాటి భుజం వేసుకుంటారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి రాజకీయంగా సంచలనానికి కేంద్రంగా ఉన్న నాయకుడు టీడీపీలోకి చేరడంతో రాష్ట్ర వ్యాప్తం గా కూడా.. లగడపాటికి ఉన్న క్రేజ్ తమకు లాభిస్తుందని టీడీపీ లెక్కలు కడుతోంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం.. లగడపాటి గుంటూరు నుంచి బరిలో నిలిస్తే.. భారీ మెజారిటీ ఖాయమని..అ దేసమయంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ కూడా మంచి విజయాలు నమోదు చేస్తుందని అంటున్నారు.