బాగా చదువుకోవాలని కోరిక ఉన్నా, ఆర్థిక శక్తి లేక ఆగిపోయిన అక్కాచెల్లెళ్ల ఆవేదన నేను విన్నాను. ఇంటర్ పూర్తయ్యాక ఏ కోర్సు చేయాలన్నా, వడ్డీ లేని రుణాలు ప్రభుత్వమే ఇప్పించేలా 'కలలకు రెక్కలు' అనే పథకం అమలు చేస్తాం.#KalalakuRekkalu pic.twitter.com/BR9sZMjbBx
— Lokesh Nara (@naralokesh) March 9, 2024
TDP ( టీడీపీ ) అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన `కలలకు రెక్కలు` పథకానికి అనూహ్యమైన భారీ స్పందన లభిస్తోంది. ఈ పథకాన్ని ప్రారంభించిన వెంటనే.. టీడీపీ దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది. దీంతో ఆ పోర్టల్ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థినులు ఈ పథకంలో జాయిన్ అయ్యారు.
నారా భువనేశ్వరి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ ‘కలలకు రెక్కలు’ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. 11 వేల 738 మంది యువతులు తమ పేరు, వివరాల్ని సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసు కున్నారు. వెబ్ సైట్లో పేర్లు వివరాలు నమోదు చేసేందుకు ఎలాంటి ఇబ్బందీ లేకపోవడం.. సునాయా సంగా ఎవరికి వారు వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఈ పథకం విద్యార్థినులను అమితంగా ఆకర్షిస్తోంది.
ఏ విద్యార్థినీ కూడా తన చదువును మధ్యలోనే ఆపకూడదనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా ఇంటర్ తర్వాత పైచదువులకు తీసుకొనే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది. కోర్సు కాలానికి అయ్యే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. దేశంలో ఎక్కడ చదివినా ఈ పథకం వర్తిస్తుంది.
ఇదే ఇండియాలో డాక్టర్లకంటే విదేశాల్లో నర్సింగ్ చేసిన వరకే ఎక్కువ విలువ ఉంది. దానికి ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వమే రుణం ఇప్పించి, దాని వడ్డీ చెల్లించి, మా కలలను నెరవేర్చుకోవటానికి దోహదమవుతుంది #KalalakuRekkalu pic.twitter.com/25ZN6YCyWw
— CBN FOR THE BETTER FUTURE (@cbnbetterfuture) March 13, 2024