ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. జగన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అంచనావేస్తున్నారు. ఇప్పటికైనా.. ముఖ్యమంత్రి జగన్ కళ్లు తెరవాలని కోరుతు న్నారు. లేకపోతే.. సర్కారు ఇక, చతికిల పడడం ఖాయమని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇదేదో రాజకీయంగా మాత్రం కాదు.. మరి విషయం ఏంటి? ఎందుకు? అంటే.. ప్రస్తుతం కరోనా తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా కలవరపెడుతోంది. నిన్నటికి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది కరోనాతో మరణించారు.
అదేసమయంలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలల్లో బెడ్లు లభించడం లేదు. ఆక్సిజన్ కొరత కూడా వెంటాడుతోంది. సరే! ఈ పరిణామాలు ఇలా ఉంటే.. ఇప్పుడు.. ప్రభుత్వ వ్యవస్థలోనే ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న సచివాలయ ఉద్యోగులు ముగ్గురు మరణించారు. వీరంతా కూడా ఉన్నతస్థాయి అధికారులు కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఇక, ఇప్పుడు సోమవారం.. మరో కీలక అధికారి మృతి చెందారు. వీరంతా కూడా కరోనా బారిన పడిన కేవలం రెండు రోజుల్లోనే మృతి చెందడం కలకలం రేగుతోంది.
దీంతో సచివాలయ ఉద్యోగులకు అప్రకటిత సెలవులు ప్రకటించారు. అయితే. కొందరిని విధులకు హాజ రు కావాలని ఆదేశించారు.కానీ, ఎవరూ రాలేదు. దీంతో సచివాలయం బోసిపోయింది. ప్రబుత్వం తక్షణ మే.. చర్యలు తీసుకోవాలని.. ఉద్యోగులు కోరుతున్నారు. అదేసమయంలో ఇంటి నుంచి పనిచేసుకుంటా మని కూడా కోరుతున్నారు., కానీ, ప్రబుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. దీంతో ఉద్యోగులు ఏం జరిగితే అదే జరుగుతుంది.. ప్రాణాల కన్నా ఉద్యోగం ముఖ్యం కాదు.. అనుకుని.. సెలవు కూడా పెట్ట కుండానే విధులకు డుమ్మా కొడుతున్నారు.
దీంతో ఉన్నతాధికారులు సైతం చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు ప్రబుత్వ ప్రధా న కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల.. ఎవరూ ఉద్యోగులపై కూడా ఒత్తిడి చేయలేక పోతున్నారు. అదేసమయంలో సీసీఎస్ అధికారి కూడా మరణించడంతో అటు పోలీసులు కూడా కరోనా విషయంలో హడలి పోతున్నారు. దీంతో ఇటు హోం శాఖ కూడా అప్రమత్తమైంది.
కరోనా టీకాలు ఇవ్వా లని ప్రభుత్వానికి విన్నవించింది. అయితే.. కరోనా డోసులు ప్రస్తుతం తక్కువ రావడంతో వీరి విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో పోలీసులు కూడా సెలవులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలు గమనిస్తే.. ప్రభుత్వ యంత్రాంగం మూకుమ్మడిగా కనుక ఇంటికే పరిమితమైతే.. ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.