షర్మిల రాజన్న రాజ్యం రావాలంటోంది. తల్లీ నువ్వు ఆంధ్రా అంతా తిరిగావు.
మీ అన్నయ్య రాజన్న రాజ్యం తీసుకొస్తానని నాలుగు సంవత్సరాలయింది.
ఏం తీసుకువచ్చాడు. ? అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జగన్ ని షర్మిలని కలిపి ట్రోల్ చేశాడు.
మీ అన్నయ్య తెచ్చింది రాక్షస రాజ్యం అని వ్యాఖ్యానించాడు. అంతటితో కేఏ పాల్ ఆపలేదు. రైమింగ్ తో సెటైర్లు వదిలాడు.
రాజన్న రాజ్య తెస్తానని రాక్షస రాజ్యం తీసుకువచ్చాడు. అవినీతి రాజ్యం తీసుకువచ్చాడు. నాలుగైదు లచ్చల కోట్లు అప్పు చేశాడు. క్యాపిటల్ కట్టలేదు. స్పెషల్ స్టేటస్ తీసుకురాలేక పోయాడు. చివరకు మోదీకి మసాజ్ చేస్తున్నాడు, పాద పూజ చేస్తున్నాడు.
తెలుగు ప్రజలారా … ప్రపంచానికి సత్తా చూపించినోళ్లం. మనకేం గతిలేదా అని ప్రశ్నించాడు పాల్. మొత్తానికి కామెడీ చేస్తాడనిపించిన పాల్ మాటల్లో చాలా డెప్త్ ఉంటుంది.