అల్లు అర్జున్..టాలీవుడ్ స్టార్ హీరోగా, సౌత్ లోని అగ్రనటులలో ఒకరిగా వెలుగుతున్న హీరో. పుష్పకు ముందు దక్షిణాదిలో మాత్రమే స్టార్ డమ్ ఉన్న ఐకాన్ స్టార్ బన్నీ…ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ‘పుష్ప’గా బన్నీ చాలా దేశాల్లో పాపులర్ అయ్యాడు. ఈ సంచలన విజయంతో విపరీతమైనా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీతో నటించేందుకు అగ్ర కథానాయికలు కూడా క్యూ కడుతున్నారు.
ఓ పక్క బన్నీతో స్టెప్పులేసేందుకు స్టార్ హీరోయిన్స్ అంతా లైన్లో ఉంటే….ఓ నటి మాత్రం బన్నీకి నో చెప్పిందట. తన పక్కన హీరోయిన్ గా నటించాలని బన్నీ అడిగితే…ఓ అమ్మడు పుసుక్కున నో అనేసిందట. దీంతో, అల వైకుంఠపురంలో బంటు మాదిరిగా బన్నీ…పక్కకు ఆకాశాంలోకి చూశాడట. అంతేకాదు, తాను చాలా యంగ్ అని, తన పక్కన బన్నీ ముసలోడిలా కనిపిస్తాడని కూడా చెప్పడంతో బన్నీ షాకయ్యాడట.
ఆ మాట విని బన్నీ తెగ నవ్వుకున్నాడట. ఇంతకు బన్నీ నో చెప్పిన ఆ భామ ఎవరో తెలిస్తే మీరూ షాకవుతారు. బన్నీ తొలి సినిమా గంగోత్రిలో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించి మెప్పించిన కావ్య బన్నీకి నో చెప్పిందట. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో రాణించిన కావ్య ఇప్పుడు హీరోయిన్ అయింది. ‘మసూద’ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కావ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ సందర్భంగా బన్నీ గురించిన ఆ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది కావ్య. గంగోత్రి సమయంలో తనను బన్నీ ఆటపట్టించారని, తాను హీరోయిన్ అయిన తర్వాత డేట్స్ కావాలని అడిగారని కావ్య చెప్పింది. అయితే, తాను హీరోయిన్ అయ్యే సమయానికి బన్నీ ముసలివారు అయిపోతారంటూ అప్పట్ల సమాధానమిచ్చానని కావ్య చెప్పుకొచ్చింది. తన సమాధానం విని బన్నీ నవ్వేశారని చెప్పిందీ అమ్మడు. అయితే, అదంతా గతం, ఇప్పుడు బన్నీ పిలిచి తన పక్కన హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానంటే కచ్చితంగా ఈ అమ్మడు నో చెప్పే చాన్సే లేదు.