‘‘ మేం మాట్లాడకూడదా?…మేం మాట్లాడకూడదా?…మేం పారిపోయే బ్యాచ్ కాదు…జగన్ కాదు ఇక్కడ లోకేష్…నిలబడి చెబుతాం…కాస్త ఓపిక పట్టు’’ ఓ విలేకరిని ఉద్దేశించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పిన ఈ డైలాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను జగన్ లా మీడియాను చూసి పారిపోనని…నిలబడి అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తానని లోకేష్ చెప్పిన డైలాగ్ టీడీపీ నేతలు, కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
తెనాలికి చెందిన టీడీపీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ కొద్ది రోజుల క్రితం మరణించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబాన్ని లోకేష్ నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడుతుండగా…ఓ మీడియా చానెల్ రిపోర్టర్ చికాకు తెప్పించాడు. దీంతో, ఆ విలేకరికి లోకేష్ దీటుగా జవాబిచ్చారు. తాను అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతానని, ఓపిక పట్టాలని హితవు పలికారు. జగన్ తాత రాజారెడ్డికే తాము భయపడలేదని… ఇప్పుడు జగన్కు భయపడతామా? అని అన్నారు.
తనపై 15 కేసులు పెట్టారని, 7 సార్లు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని అయినా భయపడేది లేదని అన్నారు. మంగళగిరి, కుప్పం, తెనాలిల్లో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం అడ్డుకుంటోందని, అన్నా క్యాంటీన్లను చూస్తే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయమని లోకేష్ ప్రశ్నించారు. గతంలో ఏనాడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కలేదని, కానీ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని నారా లోకేష్ చమత్కరించారు.
ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతోనే ముందుకు సాగుతున్నామని, వైసీపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని లోకేష్ చెప్పారు. పనితీరు బాగోలేకపోతే మరోసారి మంత్రులని మారుస్తానని జగన్ రెడ్డి అంటున్నారని, అన్ని సార్లు మంత్రులను మార్చే బదులు ముఖ్యమంత్రినే మారిస్తే బాగుంటుందని సెటైర్లు వేశారు. ఏది ఏమైనా, జగన్, రాజారెడ్డిలపై లోకేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ టీడీపీ క్యాడర్ లో కొత్త జోష్ నింపాయి. ప్రస్తుతం ఆ డైలాగుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పారిపోడానికి ఇక్కడుంది జగన్ రెడ్డి కాదు @naralokesh 🔥🔥 pic.twitter.com/l8tQCygseX
— iTDP Official (@iTDP_Official) September 8, 2022
Comments 1