ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ చిత్రాల్లో `గేమ్ ఛేంజర్` ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన గేమ్ ఛేంజర్.. ప్రేక్షకులనే కాదు మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడం, పోటీగా దిగిన సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ చిత్రాలు హిట్ టాక్ తో దూసుకుపోతుండటంతో.. గేమ్ ఛేంజర్ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది.
రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో సంక్రాంతి బరిలోకి దూకింది. 15 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఏపీ మరియు తెలంగాణలో గేమ్ ఛేంజర్ రూ. 67.83 కోట్ల షేర్, రూ. 100.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. అలాగే కర్ణాటకలో రూ. 4.91 కోట్లు, తమిళనాడులో రూ. 4.32 కోట్లు, కేరళలో రూ. 25 లక్షలు, హిందీ మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 17.34 కోట్లు వసూల్ చేసిన గేమ్ ఛేంజర్.. ఓవర్సీస్ లో రూ. 13.43 కోట్ల రేంజ్లో షేర్‌ను సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా 15 రోజుల్లో గేమ్ ఛేంజర్ చిత్రానికి రూ. 108.08 కోట్ల షేర్, రూ. 198.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ లెక్కన టార్గెట్ లో సగం కూడా రికవరీ అవ్వలేదు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా రూ. 114.92 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తం రావడం చాలా కష్టం. థియేట్రికల్ రన్ క్లైమాక్స్ కి చేరుకోవడంతో గేమ్ ఛేంజర్ డిజాస్టర్ దిశగా పయనమవుతోంది.