యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఇటీవల ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. మొదట సమంతను చై ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరి వివాహం జరగగా.. 2021 అక్టోబర్ లో వ్యక్తిగత విభేదాలతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సమంత ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. చైతు మాత్రం సామ్ తో విడిపోయిన కొంత కాలానికే ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తో ప్రేమలో పడ్డాడు. దాదాపు రెండేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట 2024 డిసెంబర్ మొదటి వారంలో పెద్దల సమక్షంలో ఏడడుగులు వేశారు.
ప్రస్తుతం చైతు, శోభిత, సమంత ముగ్గురూ తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఇకపోతే చై-సామ్-శోభిత ఈ ముగ్గురు కలిసి ఓ సినిమాలో నటించారని మీకు తెలుసా..? ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు `మజిలీ`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ ఇది. వివాహం అనంతరం సమంత, నాగచైతన్య జంటగా నటించిన తొలి సినిమా మజిలీ.
2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అటు చైతు, ఇటు సమంత కెరీర్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మజిలీలో శోభిత కూడా యాక్ట్ చేసిందట. ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ కనిపించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం మొదట శోభితను ఎంపిక చేశారట డైరెక్టర్ శివ నిర్వాణ. చై-శోభితలపై రెండు మూడు సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల శోభిత మజిలీ నుంచి తప్పుకుంది. దాంతో ఆమె ప్లేస్ ను దివ్యాంక కౌశిక్ తో రిప్లేస్ చేశారనే న్యూస్ గతంలో ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టింది.