టాలీవుడ్ టాప్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఏడాదికి ఒక సినిమా చేసినా కూడా కోట్లలో రెమ్యూనరేషన్.. లగ్జరీ లైఫ్. కానీ వాటిని వదిలి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల బాట పట్టారు. జనసేన పేరుతో సొంతంగా పార్టీని స్థాపించి ఏపీ పాలిటిక్స్ ని మలుపు తిప్పారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా పదేళ్లకు పైగా ప్రజల్లోనే ఉంటూ పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగారు. దత్తపుత్రుడు.. ప్యాకీజిస్టార్ అంటూ ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేని మాత్రమే గెలిపించుకోగలిగిన పవన్ కళ్యాణ్.. 2024 లో అద్భుతాలు సృష్టించారు.
టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దూకారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తాను శాసనసభకు తొలిసారి ఎన్నిక అవ్వడమే కాకుండా.. తన పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందర్నీ గెలిపించుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు. కూటమి అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకరాం చేశారు. అలాగే మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నుంచి పౌరసరఫరాశాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ కేబినేట్లో చోటు సంపాదించుకున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ తన రూటే సపరేట్ అంటూ దూసుకుపోతున్నారు. సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే జనతా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వినడమే కాకుండా అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇక ఇప్పుడు తన పాలనలో క్యూఆర్ కోడ్ ను ప్రవేశపెట్టి డిప్యూటీ సీఎంగారు మరోసారి హెడ్ లైన్స్ లో నిలిచారు. రాజకీయాల్లో మాదిరిగానే పాలనపైనా పట్టు సాధించేందుకు పవన్ కళ్యాణ్ కొత్త దారి ఎంచుకున్నారు. సాంకేతికత సాయంతో తమకు కేటాయించిన శాఖలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రజల నుండే సలహాలు, సూచనలు తీసుకోవడానికి రెడీ అయ్యారు. జనసేన చేపట్టిన శాఖలకు సంబంధించి ఎవరైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్కాన్ చేసి సలహాలు పంపమంటూ ఏజీ ప్రజలను జనసేన కోరింది. ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఓ గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ద్వారా ప్రజలు జనసేన మంత్రులకు కేటాయించిన శాఖలను ఎంపిక చేసుకుని సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. ప్రజలను కూడా పాలనలో భాగం చేయాలన్న పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచన ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలి అనుకుంటే QR ద్వారా లేదా లింక్ ద్వారా ఈ Google Form ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు !
లింక్ : https://t.co/KZGvzp2hb3 pic.twitter.com/O3w63gOFmP
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024