గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమైన సీఎం చంద్రబాబు బృందం
రాత్రి 1.30 గంటలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్ కు ప్రయాణం
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు.
సిఎం తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకుంటారు.
ఢిల్లీ నుంచి అర్థరాత్రి 1.30 గంటకు జ్యూరిచ్ కు వెళ్లనున్నారు.
రేపు ఉదయం జ్యూరిచ్ లో పలు సమావేశాల్లో సిఎం పాల్గొననున్నారు.
జ్యూరిచ్ లో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు.
తరువాత హయత్ హోటల్ లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం రోడ్డు మార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్ లో జరిగే WEF (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో పాల్గొంటారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బ్రాండ్ ఎపి ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రికి అధికారులు విషెస్ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, సిఎంవో అధికారులు సిఎం సర్….ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పారు.
దావోస్ పర్యటన ఫలవంతం అవ్వాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని వారు ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు.