ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుక మంగళవారం జరగనుంది. దీనికి సంబంధించి పార్టీ నుంచి.. ఎలాంటి అధికారిక, అనధికారిక ఉత్తర్వులు రాలేదు. అయిప్పటికీ.. నియోజకవర్గం, మండలం స్థాయిలో .. నాయకులు ఈ వేడుకలను అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఏం చేసినా.. జగన్ దృష్టిలో పడాలనేది వారి వాదన. అయితే.. ఈ క్రమంలో పెద్ద ఎత్తున బహిరంగ సభలు, కేక్ కటింగులు.. అతిథుల ను ఆహ్వానించే కార్యక్రమాలు.. ఇలా అనేక రూపాల్లో కార్యక్రమాలు రెడీ చేసుకున్నారు. మరి ఈ కార్యక్రమాలకు ఎంత లేదన్నా.. లక్షల్లో ఖర్చు అవుతుంది.
మరి ఈ సొమ్మును ఎవరు ఇస్తారు? అంటే.. సహజంగా అయితే.. నాయకులే తమ జేబుల్లోంచి భరించాలి. కానీ.. ఇప్పుడు నాయకులు.. డబ్బులు తీయడం లేదు. అంతా మీదే బాధ్యత అంటూ.. తమ తమ నియోజ వర్గాల్లోని బడా వ్యాపారులకు ఫోన్లు చేయిస్తున్నారట. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ఇస్తున్నా.. మరి కొందరు మాత్రం.. తమ పరిస్థితి బాగోలేదని.. కరోనాతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు లక్షలకు లక్షలు అంటే.. ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తామని వారు ప్రశ్నిస్తున్నారట. ముఖ్యంగా ఈ వాదన.. విజయవాడ, అనంతపురం, రాజమండ్రి, గుంటూరు, విశాఖ, సత్తెనపల్లి వంటి చోట్ల బలంగా వినిపిస్తున్నట్టు తెలుస్తోం ది.
దీంతో అధికార పార్టీ నాయకులు.. నేరుగా వారిని ఏమీ అనకుండా.. “అయితే మీ ఇష్టం“ అని సింపుల్గా హెచ్చరించి వదిలేస్తున్నారట. దీంతో వ్యాపార వర్గాలు హడలిపోతున్నాయి. ఏం జరుగుతుందో.. ఏమో.. అని బెంగపెట్టుకుంటున్నారు. పోనీ.. తమకు పరిచయం ఉన్న నాయకులతో ఈ విషయం చెప్పినా.. వారు కూడా మౌనంగా ఉంటున్నారట. మీ ఇష్టం.. ఇస్తే ఇవ్వండి.. లేకపోతే.. ఏం జరుగుతుంది? అని భరోసా ఇచ్చే నాయకులు కూడా కనిపించడం లేదట.
ఈ విషయంపై తాజాగా వ్యాపార వర్గాలు.. విజయవాడలో భేటీ అయ్యాయి. ఏం చేయాలి? అనేవిషయంపై తర్జన భర్జన చేస్తున్నారు. కాదని అంటే.. రేపు అధికారుల దాడులు జరిగే అవకాశం ఉంది. ఔనని అంటే.. లక్షలకు లక్షలు ఇప్పుడు వృధాగా ఇవ్వాలి.. అని మథన పడుతున్నాయట. ఇదీ..జగన్ పుట్టిన రోజు నాడు.. వ్యాపారులు కన్నీళ్లు పె ట్టే పరిస్థితి తీసుకువచ్చింది.