రామ్ చరణ్ కొత్త సినిమాల లైనప్ విషయంలో చాలా గందరగోళం నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్న ప్రకారం అయితే దీని తర్వాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఓ సినిమా చేయాల్సింది. కానీ కొన్ని నెలల పాటు కథా చర్చలు జరిగాక ఈ సినిమా క్యాన్సిల్ అయింది. కథ విషయంలో చరణ్ పూర్తి సంతృప్తి చెందకపోవడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశాడు. ఈ లోపు కన్నడ దర్శకుడు నర్తన్‌తో చరణ్ సినిమా ఉంటుందని ఒక ప్రచారం నడిచింది.
అది నిజం కాదని తేలిపోయింది. మరోవైపు ‘రంగస్థలం’ తర్వాత చరణ్ తిరిగి సుకుమార్‌తో జట్టు కట్టబోతున్నాడని, ఈ సినిమా కన్ఫమ్ అయిపోయిందని, దీని ఇంట్రో సీన్ కూడా ఆల్రెడీ తీసేశారని అన్నారు. కానీ ఈ కాంబోలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో క్లారిటీ లేదు.
సుకుమార్‌తో చరణ్ సినిమా ఉండొచ్చు కానీ.. శంకర్ చిత్రం తర్వాత అదే పట్టాలెక్కుతుందని చెప్పలేం. కాగా లేటెస్ట్ హాట్ న్యూస్ ఏంటంటే.. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానాతో చరణ్ జట్టు కట్టబోతున్నాడట. ‘ఉప్పెన’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా ఓకే అయినట్లే అయి ఇప్పుడు అది హోల్డ్‌లో పడింది. కథా చర్చలు ఒక కొలిక్కి రాకపోవడం, తారక్ ఎప్పుడు ఫ్రీ అయ్యేది తెలియకపోవడమే అందుక్కారణం అంటున్నారు.
ఐతే ఇటీవలే చరణ్‌కు ఓ కథ చెప్పి ఒప్పించాడట బుచ్చిబాబు. చకచకా ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిపోయిందట. సతీష్ కిలారు అనే కొత్త నిర్మాత పెద్ద బడ్జెట్లో, పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను నిర్మించనున్నారట. శంకర్ సినిమా షూటింగ్ రెగ్యులర్‌గా జరగని నేపథ్యంలో ఆ చిత్రం పూర్తి కాకముందే బుచ్చిబాబు సినిమాను మొదులపెట్టి దాంత సమాంతరంగా చరణ్ దీన్ని చేసే అవకాశాలున్నాయట.