అఖండ సూపర్ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ దేశంలో అత్యుత్తమ రేటింగ్ పొందిన షోలలో ఒకటిగా నిలవడంతో అతనికి ఈ వయసులో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగింది.
ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తున్నారు. వీరసింహా రెడ్డి టైటిల్ తో ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ నిన్నటి నుంచి తెగ వైరల్ అవుతోంది.
సినిమాలు ఎలా ఉన్నా పారితోషికం విషయంలో బాలయ్య చాలాకాలంలో టాప్ లో లేడు. కానీ అఖండ, అన్ స్టాపబుల్ కారణంగా… బాలయ్య క్రేజు భారీగా పెరిగింది. దీంతో ఈ సినిమా కోసం బాలకృష్ణ కు 18 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు చెబుతున్నారు.
బాలయ్య క్రేజు యూత్ లో బాగా పెరిగిన నేపథ్యంలో గోపీచంద్ మలినేని చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. అఖండ సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య రేటు బాగా పెరిగిందని చెప్పొచ్చు.
బాలకృష్ణ త్వరలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి పని చేయనున్నారు. బాలకృష్ణ 25 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్‌గా కోట్ చేశాడని తెలుస్తోంది. దీనికి నిర్మాతలు తమ ఆమోదం తెలిపారు. ఇది బాలయ్య కెరీర్లో అత్యధిక పారితోషికం.
మాస్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్‌లో ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలు ఈ చిత్రం 2023 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం హీరోయిన్ మరియు ఇతర నటీనటుల కోసం వేట కొనసాగుతోంది. పేరు పెట్టని ఈ మాస్ ఎంటర్టైనర్కి థమన్ సంగీతం అందిస్తున్నాడు.