కృష్ణ హరే.. జయ కృష్ణ హరే.. అంటూ.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాడుకుంటున్నారు. జన్మాష్టమిని పురస్కరించుకుని.. తన కష్టాలు నెమరు వేసుకుంటున్నారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుట్టిన నాటి నుంచే అనేక కష్టాలు పడ్డాడు. బాలుడిగా ఉన్నప్పుడు.. పూతన వంటి రాక్షసులో ఆయన ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొని బయట పడ్డారు. తర్వాత కాలంలో సొంత మేనమామ కంసుడిపైనే యుద్ధం చేయాల్సి వచ్చింది.. ఆయనను వధించాల్సి కూడా వచ్చింది.
ఇలా.. కృష్ణుడి జీవితం మొత్తం.. పెను సవాళ్లతో కూడుకుపోయింది. ఎక్కడా ఆయన సుఖ పడింది లేదు.. ఒక్క క్షణం కూడా తన కోసం జీవించింది కూడీ లేదు. మధ్య వయసులో పాండవుల కోసం రాయబారాలు చేశాడు. చివరిలో యుద్ధం వరకు తీసుకువచ్చి.. అర్జనుడికి సారథ్యం చేశాడు.. ఇప్పుడు ఇదే జీవితం తనకు అన్వయించుకుని షర్మిల.. కృష్ణ హరే.. జయ కృష్ణహరే.. అంటూ గానం చేసుకుంటున్నారు. ఈమె చిన్నప్పటి జీవితంలోనూ అనేక ఒడిదుడుకులు ఉన్నాయి.
వాటిని పక్కన పెడితే.. రాజకీయాల్లోకి వచ్చాక.. అచ్చం కృష్ణుడు ఎదుర్కొన్న సమస్యలనే ఎదుర్కొన్నారు. వైసీపీకోసం అహర్నిశలు పోరాటం చేసి.. పాదయాత్ర చేసినా.. ఫలితం లభించలేదు. దీంతో పొరుగు రాష్ట్రానికి మకాం మార్చి పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడ కృష్ణుడి మాదిరిగా పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు కాంగ్రెసలో చేరారు. నాడు సొంత మేనమామపై శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తే.. షర్మిల సొంత అన్న జగన్‌పైనే యుద్ధం చేసి.. వీరోచిత పోరాటం చేసి.. ఎన్నికల్లో మట్టికరిపించారు.
ఇక, ఇప్పుడు పాండవుల వంటి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తూ.. పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. దీనికోసం.. నాడు శ్రీకృష్ణుడు నెరపిన రాయబారాలు.. చేసిన ప్రయత్నాలు అన్నీ షర్మిల చేస్తున్నారు. అయితే.. నాడు శ్రీకృష్ణుడు పాండవులను గెలిపించినా.. ఇక్కడ షర్మిల ఏమేరకు విజయం దక్కించుకుని పార్టీని గెలుపు గుర్రం ఎక్కిస్తారు.. పరువు నిలబెడతారు..? అనే చూడాలి. ఏదేమైనా.. జన్మాష్టమిని పురస్కరించుకుని.. కృష్ణుడి లీలలు.. తనకు కూడా సేమ్ టు సేమ్ అంటూ.. షర్మిల వగరుస్తున్నారు.