సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఏపీ మాజీ నిఘా అధిపతిగా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా ప్రభుత్వం సస్పెండ్ చేయటం తెలిసిందే. బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటమే కాదు.. ప్రభుత్వంలోని కీలక నేత చెప్పారని.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనంపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
తాజాగా ఈ అంశంపై ఏపీ డీజీపీ ఇచ్చిన రిపోర్టు నేపథ్యంలో అతడ్ని.. అతడికి సహకరించిన మరో ఇద్దరు ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పద ఐపీఎస్ అధికారిగా ఆయన్ను చెబుతారు. ఆయన్ను కదలించుకోవటానికి మించిన తలనొప్పి మరొకటి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉండేది.
అయినప్పటికీ అతడ్ని ఏం చేయలేని పరిస్థితి ఉండేదన్న మాట ఉంది.
ఇదిలా ఉంటే .. ఇటీవల బాలీవుడ్ నటి జెత్వానీ ఎపిసోడ్ తెర మీదకు రావటం.. కీలక స్థానంలో ఉన్న ఉన్నతాధికారిగా దాటకూడని గీతల్ని దాటేసిన నేపథ్యంలో ఆయనపై చర్యలకు ఏపీ సర్కారు ఉపక్రమించింది. ఇదిలా ఉంటే.. ఆయన్ను సస్పెండ్ చేయటంతో ఇప్పుడు.. ఆయన గురించి మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు.
తాజాగా ఒక టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ లో ఏపీ సీపీఎం మహిళా నేత రమాదేవి స్పందించారు. పీఎస్ఆర్ ఆంజనేయుల తీరును ఆమె చెప్పుకొచ్చారు. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. అందమైన అమ్మాయి కనిపిస్తే విడిచి పెట్టేవాడు కాదంటూ పెద్ద బాంబే పేల్చారు. డిబేట్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆయన మనసు పడేవారు. గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఐపీఎస్ అధికారి ఆంజనేయుల మీద ఉన్నాయి’’ అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాను మనసు పడిన అమ్మాయి.. తన కోరిక తీర్చే వరకు వేధిస్తూనే ఉండేవాడని పేర్కొన్నారు.
ఐపీఎస్ అధికారిగా ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అధికారి అవన్నీ మర్చిపోయి.. మహిళల్ని లైంగికంగా వేధించటం ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు చేతిలో అధికారం ఉంది కాబట్టి.. దానికి భయపడి ఎవరూ ఫిర్యాదు చేయటానికి రాలేదని.. ఇప్పుడు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.