ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆప్ ఇప్పుడు జాతీయస్థాయిలో సత్తా చాటుతున్న పార్టీ. దేశరాజధాని రాష్ట్రం ఢిల్లీలో రెండు సార్లు వరుసగా విజయం దక్కించుకున్న ఈ పార్టీ.. ఇప్పుడు మరో కీలక రాష్ట్రం పంజాబ్‌లో పాగా వేసింది. ఇదేమంత సున్నితంగా చూసే విషయం కాదు. చాలా సీరియస్ విషయం. ఒకవైపు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా.. మరోవైపు.. కాంగ్రెస్ పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. ఆప్ .. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం.. అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది.
ఇక, ఆప్.. ఏపీలోకి ప్రవేశిస్తే.. ఎలా ఉంటుంది? అధికార పార్టీకి ఎలా చెక్ పెడుతుంది? జగన్‌కు ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుంది? ముఖ్యంగా జగన్ అవినీతి.. ఆయనపై ఉన్న కేసులు.. వంటి విషయం లో ఆప్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. 2014లో ఆప్.. ఏపీలోనూ పోటీ చేసింది. అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసింది. పైగా.. ఆప్‌కు బలమైన మేధావి వర్గం కూడా ఉండడం గమనార్హం.
ఇటీవల కాలంలో కేంద్రంపై దృష్టి పెట్టిన కేజ్రీవాల్ తన పార్టీని జాతీయస్థాయిలో పుంజుకునేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని ఏపీలోనూ భవిష్యత్తులో పుంజుకునేలా చేస్తారని అంటున్నారు. అయితే.. ఆప్‌కు నేరుగా ఏపీలో ఇప్పటి వరకు కేడర్ లేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ఆప్ పక్కాగా.. పుంజుకుంటుందనే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో జనసేన లేదా.. టీడీపీ వైపు ఆప్ చూసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఈ రెండు పార్టీలు కూడా.. బీజేపీ మాదిరిగా కాకుండా.. సీఎం జగన్‌ను అధికార పార్టీ వైసీపీని కూడా బలం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో తమకు కలిసి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకుంటే… ఆప్‌కు ఏపీలో తిరుగులేదని చెబుతున్నారు. ఈ పొత్తుల విషయానికి వస్తే.. జనసేన కంటే.. కూడా టీడీపీ అయితే.. ఆప్‌కు కలిసి వస్తుందనే అంచనాలు వస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబుకు, కేజ్రీవాల్ కు మధ్య సయోధ్య ఉంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తరఫున.. కేజ్రీవాల్ ఏపీలో ప్రచారంచేశారు.
అదే స్నేహం ఇప్పటికీ.. కొనసాగుతోంది. ఇక, జనసేన విషయానికి వస్తే.. ఈ పార్టీ వ్యూహాలు.. సహా.. పార్టీ అధినేత పవన్ విషయంలో ఆప్‌కు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో జనసేన కంటే.. కూడా టీడీపీ వైపు.. ఆప్ ఖచ్చితంగా మొగ్గుచూపుతుందని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు కూడా కెమిస్ట్రీ కుదురుతుందని అంటున్నారు. పంజాబ్‌లో అధికార పార్టీ అవినీతిని.. పార్టీలో నెలకొన్న అసంతృప్తిని కేజ్రీవాల్ క్యాష్ చేసుకున్నారు.
ఇక్కడ ఏపీలోనూ.. అధికార పార్టీలో అవినీతిని.. ముఖ్యంగా సీఎం జగన్‌పై ఉన్న అవినీతి కేసులు.. నియంతృత్వ ధోరణి వంటివి ఆయన తనకు అననుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి ప్రజల్లోనూ.. జగన్‌పై అంత సానుకూలత లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోప్రత్యామ్నాయం కోసం.. ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ కనుక రంగంలోకి దిగితే.. వైసీపీకి తీవ్రస్థాయిలో ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.
ఆప్‌కు కలిసి వచ్చే అవకాశాలు.. ఇవే!
+ ఏపీలో జగన్సర్కారుపై ఉన్న అవినీతి
+ ఆప్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్
+ అవినీతి రహిత పాలన అందిస్తున్న ఢిల్లీ మోడల్
+ వైసీపీ ప్రజాప్రతినిధుల దూకుడు
+ ఏమాత్రం ప్రజలను పట్టించుకోని నేతలు
+ బీజేపీతో వైసీపీ ఏర్పరుచుకున్న లోపాయికారీ పొత్తు