జరుగుతున్న పరిణామాలు.. నమోదవుతున్న కేసులతో వైసీపీ ఫైర్ బ్రాండ్లకు తడిసిపోతోందా? ఇదీ.. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. వైసీపీ హయాంలో మా అంతటివారు లేరన్న ట్టుగా చాలా మంది నాయకులు రెచ్చిపోయారు. నోటికి ఎంత మాట పడితే అంత మాట మాట్టాడారు. ఈ పరిణామాలకు ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయి. కేసులు పెడుతున్నారు. జైళ్లకు పంపిస్తున్నారు. తాజాగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని కూడా జైలుకు తరలించారు.
ఇక, అమెరికాలో ఉంటూ.. వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడిన అనంతపురం జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు వైసీపీకి వంత పాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక, స్థానికంగానే ఉంటూ కూడా.. మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీరంతా సైలెంట్ అయిపోయారు. బోరుగడ్డ దూకుడుతో అనేక మంది ఆయనకు మద్దతుగా అన్నట్టు.. వీర విహారం చేశారు. అయితే.. అనిల్ అరెస్టు.. తర్వాత.. అందరూ మూగనోము పట్టారు.
నిజానికి వైసీపీ సోషల్ మీడియా అంటే.. బూతులు, తిట్లు అన్నట్టుగానే సాగింది. వారిని ఎవరు ప్రోత్సహిం చారో.. తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం చిక్కుల్లో పడ్డారు. ఏకంగా హైకోర్టుపైనే బూతులు విసరడం.. తీర్పులను సైతం తప్పుబట్టడం తెలిసిందే. జగన్ను ఏమైనా అంటే.. తాటతీస్తా అన్నవారు కూడా ఉన్నారు. కానీ, రోజులు అన్నీ ఒకేలా ఉండవు కదా.. ఇప్పుడు వారి కోసం ఏపీ పోలీసులు వెతుకుతున్నా రు. ముఖ్యంగా అమెరికా నుంచి ప్రదీప్ చింతా సహా పలువురు వైసీపీని ఆకాశానికి ఎత్తేయడం తెలిసిందే.
ఇప్పుడు ఇలాంటి వారు మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణం.. కూటమి సర్కారు యాక్షన్ తీవ్రంగా ఉండబట్టేనన్నది అందరికీ తెలిసిందే. ఇక, స్థానికంగా ఉన్ననాయకులు కూడా సైలెంట్ అయ్యారు. మాజీ మంత్రులు కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, రోజా వంటివారు కూడా.. ఎంత మాట పడితే అంత మాట అనేసేవారు.
కానీ, ఇప్పుడు అసలు నాని కనిపించడమే మానేశారు. రోజా తెరమీదికి వచ్చినా.. చాలా నిర్మాణాత్మకంగా విమర్శలు చేసి వెళ్లిపోతున్నారు. పెద్ద పెద్ద తలకాయలనే అరెస్టు చేస్తున్న నేపథ్యంలో తమను కూడా అరెస్టు చేస్తే పరిస్థితి ఏంటని వారు ఆలోచిస్తున్నట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు.