రామ్ గోపాల్ వర్మ ఎవరి కోసమో తన తీరు మార్చుకునే రకం కాదు. ట్విట్టర్లో అయినా.. బయట అయినా.. తాను ఏమనుకుంటే అది చేస్తాడు. ఎలా పడితే అలా మాట్లాడతాడు. తన ముందున్న వ్యక్తులు ఎలాంటి వాళ్లు.. తాను ఉన్న వేదిక ఎలాంటిది అన్నది అస్సలు చూసుకోడు. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకు ఏం తోచితే అది మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని నాగార్జున యూనివర్శిటీలో జరిగిన ఎడ్యుకేషనల్ ఫెస్ట్‌కు అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకులకు దిమ్మదిరిగే అనుభవం ఎదురైంది.
ఆయన ఎప్పుడూ ట్విట్టర్లో చెప్పే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల గురించి ఈ వేదిక మీద మాట్లాడటంతో ఆ కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఇతర ప్రముఖులు, లెక్చరర్లు అవాక్కయ్యారు. ఇంతకీ ఈ కార్యక్రమంలో వర్మ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం పదండి.
నేనిక్కడ మంచి వాడిగా ఉండి చనిపోయాక స్వర్గంలో ఎంజాయ్ చేద్దాంలే అనుకుని వెళ్తే ఒకవేళ అక్కడ ఏం లేకపోతే ఎలా? అందుకే స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక ఉంటారో లేదో తెలియదు కాబట్టి.. ఇక్కడే వాళ్లను వెతుక్కుని ఎంజాయ్ చేస్తా. రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి ఎంజాయ్ చేస్తేనే నాకు మోక్షం వస్తుందని అనుకుంటా. నేను చనిపోయాక ఈ ప్రపంచం మొత్తం ఒక్క క్షణంలో అంతం అయిపోయినా నాకేం పట్టింపు లేదు. ఎందుకంటే నేను నాకోసం బతుకుతా?
మీ భవిష్యత్ ఏంటి.. మీరు ఎలా చదువుతున్నారన్నది నేను కేర్ చేయను. ఏదైనా వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా అంతం అయిపోవాలని కోరుకుంటా అని వర్మ వ్యాఖ్యానించాడు. వర్మ ఈ వ్యాఖ్యలు చేస్తుంటే విద్యార్థులంతా ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు కానీ.. ఎడ్యుకేషనల్ ఫెస్ట్‌కు వర్మ లాంటోడిని పిలిచి తప్పు చేశామని నిర్వాహకులు మాత్రం తల పట్టుకునే ఉంటారు.
Super thrilled to receive my B tech degree today 37 years after I passed , which I never took it in 1985 since I wasn’t interested in practicing civil engineering..Thank you #AcharyaNagarjunaUniversity ????????????Mmmmmmuuaahh ???????????? pic.twitter.com/qcmkZ9cWWb
— Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2023