‘బాషా’ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మాఫియా డాన్ గా తన నట విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. ముంబైలో కరుడుగట్టిన మాఫియా లీడర్ ‘బాషా‘…సాదా సీదా ఆటో డ్రైవర్ గా జీవితం గడుపుతుండడం…ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు మాణిక్యం మాఫియా డాన్ అని తెలియడంతో తమ లీడర్ చేతిని అందరూ ముద్దాడి వెళ్లడం ఆ ఇంటర్వెల్ సీన్ కే హైలైట్. ఇక, మాఫియా డాన్ బాషాను అంతకు ముందు కూడా అతని అనుచరులు చేతి మీద ముద్దు పెట్టుకుంటూ తమ వీర విధేయతను చాటుతుండడం కనిపిస్తుంది. అయితే, తాజాగా ఏపీలో జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కూడా అచ్చుగుద్దినట్లు ఇదే సీన్ రిపీట్ అయింది.
తమకు మంత్రి పదవి కట్ట బెట్టిన సంతోషంలో కొత్త మంత్రులు కొందరు సీఎం జగన్ ను ‘బాషా’తరహాలో మాఫియా డాన్ ను చేశారు. జగన్ చేతిని ముద్దాడుతూ తమ వీర విధేయతను వారు చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొందరు జగన్ కాళ్ల మీద పడి చేతిని ముద్దాడడంతో గవర్నర్ విశ్వభూషణ్ సహా వేదికపై ఉన్నవారంతా షాకయ్యారు. ఇక, సినీ ఫక్కీలో ఈ సీన్ ను రక్తి కట్టించడం మొదలుబెట్టింది…జగన్ లోని డాన్ ను తట్టి లేపింది మాత్రం తాజా మాజీ నటి, తాజా మంత్రి రోజా కావడం విశేషం.
మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రోజా జగన్ కు నమస్కారం చేసి…వెంటనే కాళ్లకు మొక్కారు. ఆ తర్వాత జగన్ తో మాట్లాడి అనుమతి తీసుకున్నట్లు తీసుకొని ఆయన చేతిపై సినీ ఫక్కీలో ముద్దు పెట్టారు. ఆ తర్వాత రోజా చూపిన బాటలో మరికొందరు కూడా డాన్ జగన్ చేతిని ముద్దాడి విధేయతను చాటుకున్నారు. మంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్ జగన్ కాళ్లకు నమస్కారం చేయగా..గుడివాడ అమర్ నాథ్, జోగి రమేశ్ లు వీర విధేయ రామలుగా మారి…మోకాళ్ల మీద వంగి మరీ పాక్షిక సాష్టాంగ నమస్కారం చేశారు.
మొత్తంగా జగన్ ను డాన్ గా మార్చిన రోజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆల్రెడీ పులివెందులలో జగన్ ఫ్యాక్షన్ డాన్ అని, బాషాలో రజనీకాంత్ మాదిరి ఫ్యాక్షన్ లీడర్ గా కడపలో బీభత్సం సృష్టించి ఇలా గుట్టుచప్పుడు కాకుండా తాడేపల్లి ప్యాలెస్ లో సీఎంగా బతికేస్తున్నారని పంచ్ లు వేస్తున్నారు. అయితే, బాషా సినిమాలో రజనీకాంత్ మాఫియాను వదిలేసి వస్తారని, కానీ, సీఎం అయిన తర్వాత కూడా జగన్ తన ఫ్యాక్షన్ డాన్ పాత్రకు కొన్ని సందర్భాల్లో న్యాయం చేస్తుంటారని ట్రోల్ చేస్తున్నారు.
అన్నగా ఆశీర్వదించి.. కేబినెట్ లో అవకాశమిచ్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను. Thank You @ysjagan Anna ????????????#CMYSJagan #APNewCabinet #APNewMinisters pic.twitter.com/oTX9RqDfgR
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 11, 2022