టీడీపీ అధినేత చంద్రబాబు కు 70 ఏళ్లు దాటినా.. ఇంకా ముఖ్యమంత్రి పీఠంపై ఆశ తీరలేదని.. ఆయనకు పదవీ వ్యామోహం చావలేదని.. వైసీపీ నాయకులు, మంత్రులు కూడా పదే పదే విమర్శించడం తెలిసిం దే. అయితే.. ఈ విషయం ఎలా ఉన్నా.. తాజాగా విశాఖలో ఆయన నిర్వహించిన రెండున్నర కిలో మీటర్ల పాదయాత్ర సహా.. విజన్ 2047ను ఆవిష్కరించడం వంటివి చూస్తే.. ఆయనలో ఉన్న ఆశ.. ఆయనకున్న యావ అర్థమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే 25 సంవత్సరాల పాటు కష్టపడి పనిచేస్తే.. ఏపీ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎంతో ఆదర్శంగా ఉంటుందనే విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు చెప్పకనే చెప్పారు. పైగా ఈ వయసులో ఆయన విశాఖలో రెండున్న కిలో మీటర్ల మేర.. జాతీయ జెండాను మోస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఇది పైకి చూసినంత చెప్పుకొన్నంత తేలిక విషయం ఏమీ కాదు. ఎంతో ఓర్పు, ఓపికతో కూడిన లక్ష్యం.
ఇవన్నీ చూస్తే.. చంద్రబాబుకు అధికారంపై యావ ఉందని అనుకోవాలా? లేక.. రాష్ట్రంపై ఆయనకు ఉన్న అభిమానం.. రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల సరసన, దేశంలోనే సమున్నత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనే భావన ఉందని అనుకోవాలా? అంటే.. అధికారంపై యావ లేదనేది వాస్తవం. ఆయన అనుభవించని పదవులు లేవు. ఇక, ఇప్పుడు కావాల్సింది.. ఏపీని సరైన మార్గంలో పెట్టాలనే లక్ష్యమే. ఇదే చంద్రబాబు చేస్తున్నారు.
వచ్చే 2047 నాటికి ఏపీలో యువతను అన్నిరంగాల్లోనూ సద్వినియోగం చేసుకోవడం ద్వారా.. వారి శక్తిని అన్ని రంగాలకు పంపిణీ చేయడం ద్వారా.. రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే వ్యూహంతోనే విజన్ 2047ను చంద్రబాబు ఆవిష్కరించారనేది నిష్టుర సత్యం. ఇది సక్సెస్ అయితే.. తిరుగులేని శక్తిగా దేశంలోనే ఏపీ రాణిస్తుందని.. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తుందని అంటున్నారు పరిశీలకులు.