ప్రజల్లో నీ పనైపోయింది @ysjagan ????#JaganPaniAyipoyindhi pic.twitter.com/YFAnb0Ud90
— iTDP Official (@iTDP_Official) July 16, 2022
గడప-గడపకు కార్యక్రమంలో భాగంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. కొన్నిచోట్ల నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా.. ఏపీ సర్కారు వైసీపీపై ఓ మహిళ తీవ్రస్థాయిలో ఫైరైంది.
ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ నేతలను కడిగి పారేసింది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది.
ఇంటిముందుకు వచ్చిన శంకరనారాయణను ఓ మహిళ కడిగి పారేసింది. 11 నెలలుగా పింఛన్ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఓట్ల కోసం మళ్లీ వస్తారు కదా.. అప్పుడు చెబుతా! అంటూ నిప్పులు చెరిగింది. మాజీ మంత్రి శంకర నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.
పింఛన్ తీసేశారంటూ ఓ మహిళ శంకర నారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా పద్మాబాయి అనే మహిళ ఇంటికి వెళ్లారు. 11 నెలలుగా పింఛన్ నిలిపివేశారని రగిలిపోతున్న పద్మాబాయి ఇదే విషయంపై ఎమ్మెల్యేను నిలదీశారు. అయితే మళ్లీ వస్తానంటూ శంకరనారాయణ అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో పద్మాబాయి ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. “నిలబడి సమాధానం చెప్పలేరా ?” అంటూ నిలదీసింది.
ఇంటి సభ్యులు అంతా సముదాయిస్తున్నా ఆమె శాంతించలేదు. “ఈసారి ఓట్లడగడానికి వస్తారుగా అప్పుడు చూస్తా” అంటూ పద్మాబాయి హెచ్చరించారు. ఎమ్మెల్యేతోపాటు అధికార గణం మాత్రం ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసినట్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నంద్యాలలోనూ..
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చిన్నపురెడ్డి అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా తన నిరసన తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి.. మా గడప తొక్కండి అని బోర్డు మీద రాసి తన ఇంటి ముందు తగిలించారు. ప్యాపిలి మండలం మెట్టుపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న చిన్నపురెడ్డి… పాత పెన్షన్ విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.