వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా తన పరువును తానే తీసుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం సైలెంట్ అయిపోయిన రోజా.. ఈమధ్య మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో తన గొంతు వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుపతి లడ్డూ వివాదంపై సైతం స్పందించిన రోజా.. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంద్రబాబు ఉద్ధేశపూర్వకంగానే వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారని రోజా మండిపడ్డాడు. శ్రీవారి లడ్డూ కల్తీలో వైసీపీ తప్పేం లేదనట్లుగా కామెంట్స్ చేశారు.
అక్కడితో ఆగని మన మాజీ మంత్రి రోజా.. తన అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా తిరుపతి లడ్డూ వ్యవహారంపై, చంద్రబాబు పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది..? అంటూ రోజా పోల్ నిర్వహించారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను ఆప్షన్స్ గా ఇవ్వగా.. 74 శాతం మంది ప్రజలు జగన్ దే తప్పంటూ అభిప్రాయపడ్డారు.
వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది..? అంటూ రోజా మరొక పోల్ నిర్వహించారు. అయితే 81 శాతం మంది ప్రజలు చంద్రబాబు పాలన బాగుందని ఓటు వేయగా.. కేవలం 19 శాతం మంది ప్రజలు జగన్ కు మద్దతు పలికారు. దీంతో రోజాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మరోవైపు నెటిజన్లు పోలింగ్ విషయంలో రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదే.. ఈ దెబ్బతో రోజా పరువు, జగన్ పరువు పాయే అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. కొందరైతే రోజా, వైఎస్ జగన్ లను దారుణంగా తిట్టిపోస్తున్నారు.