పుట్టిన ప్రతి మనిషికీ మరణం తప్పదు. కాస్త ముందు వెనుకగా ఎవ్వరైనా వెళ్లిపోవాల్
సినీ రంగంలో కలిసి మెలిసి సాగిన మిత్రులు.. మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు కొంచెం గ్యాప్ లో ఒకరి వెంట ఒకరు వెళ్లిపోతుండం చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో తనువు చాలించారు. ఆయన కడసారి చూపు కోసం వచ్చినపుడు మామూలుగానే కనిపించిన సూపర్ స్టార్ కృష్ణ.. ఇంకో రెండు నెలలకే తుది శ్వాస విడవడం అభిమానులను ఎంతగానో బాధించింది.
కృష్ణంరాజుతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించి, వ్యక్తిగతంగానూ మంచి స్నేహం ఉన్న కృష్ణ.. ఆయన చనిపోయిన రెండు నెలలకే మిత్రుడికి తోడుగా అన్నట్లు వెళ్లిపోవడం గురించి అందరూ చర్చించుకున్నారు. మరి కొన్ని నెలలకే మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కూడా గత ఏడాది చివర్లో మరణించారు.
ఆయనకు నివాళిగా ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టిన మరో సీనియర్ నటుడు, కైకాల సహచరుడు చలపతిరావు రెండు రోజుల విరామంలో హఠాత్తుగా చనిపోయారు. ఇక కొన్ని రోజుల కిందటే లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆయన సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడిన దిగ్గజ గాయని వాణీ జయరాం మరుసటి రోజే హఠాన్మరణం పాలయ్యారు. లెజెండరీ సింగర్ బాలు, లిరిసిస్ట్ సీతారామశాస్త్రి, వీళ్లిద్దరి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కె.విశ్వనాథ్.. అటు ఇటుగా రెండేళ్ల విరామంలో ఈ లోకాన్ని విడిచిపోవడం విషాదకరం.