సూపర్ హిట్ మూవీ `పిల్లజమీందార్` తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ హరిప్రియ పెళ్లి రోజే తల్లిగా ప్రమోట్ అయింది. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. హరిప్రియ భర్త మరెవరో కాదు వశిష్ఠ సింహ. కన్నడలో ఫేమస్ నటుడు అయిన వశిష్ఠ.. `నారప్ప` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. `ఓదెల రైల్వేస్టేషన్` తో పాపులర్ అయ్యాడు. విలనీ పాత్రలకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యే వశిష్ఠ.. ప్రస్తుతం తెలుగులో `ఓదెల 2` చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.
ఇకపోతే 2023 జనవరి 26న హీరోయిన్ హరిప్రియను వశిష్ఠ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మైసూరులో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అయితే పెళ్లి రోజునే ఈ దంపతులు పేరెంట్స్ గా మారారు. 2025 జనవరి 26న వశిష్ఠ-హరిప్రియ జంట తమ ఫస్ట్ బేబీకి వల్కమ్ చెప్పారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హరిప్రియ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సోషల్ మీడియా ద్వారా వశిష్ఠ తెలిపాడు.
మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని వశిష్ఠ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. దీంతో వశిష్ఠ, హరిప్రియ దంపతులకు అభిమానులు, నెటిజన్లు మరియు సినీ తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, హరిప్రియ అసలు పేరు శృతి. హరిప్రియ తండ్రి, తాత ఇద్దరూ నటులే కావడంతో.. ఆమె కూడా సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో నానితో పిల్లజమీందార్, బాలయ్యతో జైసింహా సినిమాలు చేసి పాపులర్ అయింది. పెళ్లి తర్వాత మూవీస్ తగ్గించేసిన హరిప్రియ.. కుటుంబానికే అధిక ప్రధాన్యత ఇస్తోంది.
View this post on Instagram