పెట్రోలు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. క్రూడాయిల్ ధరలు బాగా తగ్గినా… రకరకాల పన్నులతో కేంద్రం సామాన్యున్ని పిండేస్తుంది. ప్రతి లీటరుపై 34 రూపాయలు రాష్ట్రానికి పన్ను వస్తుంది. మిగతాదంతా కేంద్రానికే పోతుంది.
ఇక ఇటీవల పెట్రోలు వంద రూపాయలు అయ్యింది. అంటే మోడీ ప్రధాని అయ్యాక 33 శాతం పెట్రోలు ధరలు పెరిగాయి. దీనికి చాలదు అన్నట్లు స్థానికంగా జగన్ వంటి కొందరు ముఖ్యమంత్రి అనేక ఎక్స్ ట్రా సెస్సులు వేయడం తెలిసిందే.
అప్పుడు అర్ధరూపాయి పెంచితే దేశంలో భారీ ఎత్తున ధర్నాలు జరిగేవి. కానీ ఇపుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మోడీ తన ఇష్టానికి పెంచుతున్నారు. ఆనాడు పెట్రోలు రేట్ల గురించి అసెంబ్లీలో నిలదీసిన జగన్ కూడా పెట్రోలు రేట్లు అదనంగా 4 రూపాయలు పెంచేశాడు.
ఈ ధరలపై తీవ్రంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. ఈ ధర్నాలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక ఆశ్చర్యకరమైన షాాకింగ్ పని చేశారు. ట్యాంక్ బండ్ వద్ద కాసేపు నిరసన తెలిపిన అనంతరం ఒక మంచి బైకును హుస్సేన్ సాగర్ లో పడేశారు.
ఈ రేట్లతో పెట్రోలు కొనడం వేస్ట్ అంటూ బైకును సాగర్ లో పడేసి నిరసన తెలిపారు. ఈ ఘటన చూసిన స్థానిక ప్రజలే కాదు, ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ తిన్నారు.
A bike is sacrificed by youth #Congress workers at tank bund in #Hyderabad while protesting against fuel price hike. pic.twitter.com/0ZfMvgB3R6
— Rahul Devulapalli (@rahulscribe) June 11, 2021