మోసం, ట్యాపరింగ్ ఆరోపణలపై తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ అశోక్ బాబును ఏపీసీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంటు ఉద్యోగి అయిన అశోక్ ప్రమోషన్ కోసం సర్టిఫికేట్లను ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
నిజానికి ఈ ఆరోపణలు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడే వెలుగుచూశాయి. అప్పట్లో ఈ ఆరోపణలపై విచారణ కూడా జరిగింది. ఆరోపణలన్నీ వాస్తవాలే అని నిర్ధారణ కూడా అయ్యింది. చర్యలు తీసుకోవాల్సొచ్చేటప్పటికి అశోక్ వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నారు.
ప్రభుత్వం మారగానే కమర్షియల్ ట్యాక్స్ లోనే పనిచేస్తున్న ఒక ఉద్యోగి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ జరిపింది. ఆ విచారణలో ప్రమోషన్ కోసమని తన క్వాలిఫికేషన్ డీకామ్ (డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్)ను బీకామ్ గా ట్యాంపర్ చేశారని నిర్ధారణైంది. దాంతో అశోక్ ను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని లోకాయక్త ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఎప్పుడైతే అశోక్ ను సీఐడీ అరెస్టుచేసిందో వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగేశారు. అశోక్ ను అరెస్టు చేయటం రాజకీయ కక్షసాధింపంటు మండిపడ్డారు.
మూర్ఖుడు రాజ్యమేలితే వ్యవస్థలన్నిటినీ చెరబడతాడనడానికి @ysjagan ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అర్ధరాత్రి అక్రమంగా టిడిపి నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/8k2HrOSTR5
— Lokesh Nara (@naralokesh) February 11, 2022
సిఐడి ని రాజకీయ కక్ష సాధింపు సంస్థ గా మార్చుకొని వ్యవస్థకున్న విలువను దిగజారుస్తున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ఆర్డర్ ని గుడ్డిగా అమలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.(3/3)#WeStandWithAshokBabu
— Lokesh Nara (@naralokesh) February 11, 2022