అంతరిక్షంలో కాలు పెట్టబోతున్న మూడో భారతీయురాలు, తొలి తెలుగు అమ్మాయిగా శిరీష బండ్ల చరిత్ర సృష్టించింది.
ఈరోజు శిరీష బండ్ల (sirisha bandla) అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరనుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు.
అంతరిక్షంలో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్ బెజోస్ కంటే… మేథస్సుతో మన తెలుగమ్మాయి అంతరిక్షంలోకి ప్రవేశిస్తోంది. ‘వర్జిన్ స్పేస్ మిషన్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు రిచర్డ్ బ్రాస్నన్ సారథ్యం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈయన.
శిరీష బండ్ల సొంత ఊరు గుంటూరు జిల్లా తెనాలి. అలంకార్ ధియేటర్ యజమాని & మాజీ పురపాలక సంఘ చైర్మన్ బండ్ల పుల్లయ్య చౌదరి గారి మునిమనవరాలు ఈమె.
శిరీష యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని. మైక్రోగ్రావిటీ సబ్జెక్ట్‌లో నిష్ణాతురాలు.
“# యూనిటీ 22 యొక్క అద్భుతమైన టీంలో భాగమవడం నేను చాలా గౌరవంగా ఫీలవుతున్నాను. అని శిరీష బండ్ల ట్వీట్ చేసింది.
కల్పనా చావ్లా మరియు సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన మూడవ భారతీయ సంతతికి చెందిన మహిళగా ఆమె అవతరిస్తుంది.
“నేను ఈ అవకాశాన్ని పొందుతున్నానని మొదట విన్నప్పుడు, నాకు మాట రాలేదు. వివిధ నేపథ్యాలు, విభిన్న భౌగోళికాలు మరియు విభిన్న వర్గాల ప్రజలను అంతరిక్షంలోకి తీసుకురావడానికి ఇది అద్భుతమైన అవకాశం” జూలై 6 న వర్జిన్ గెలాక్సీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చెప్పారు.