పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బద్రి సినిమా సమయంలో పవన్ తో ప్రేమ పడి సహజీవనం ప్రారంభించి రేణు దేశాయ్.. 2004లో అకీరా నందన్‌కు జన్మనిచ్చింది. 2009లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వివాహం చేసుకోగా.. 2010లో వీరికి ఆధ్య జన్మించింది. అయితే వ్యక్తిగత విభేదాలతో 2012లో పవన్, రేణు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాదే పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకోగా.. రేణు పిల్లలను చూసుకుంటూ ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.
2018లో రేణు దేశాయ్ రెండో వివాహానికి రెడీ అయింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వివాహం వరకు వెళ్లకుండానే ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేసుకుంది. అందుకు గల కారణాలేంటో వివరించింది రేణు దేశాయ్. తాజాగా నిఖిల్ విజయేంద్ర సింహాతో పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రేణు రెండో పెళ్లి గుట్టు విప్పింది.
`పవన్ తో విడిపోయాక నాకు పార్ట్నర్ కావాలనిపించింది. వ్యక్తిగతంగా చూసుకుంటే నేనూ పెళ్లి చేసుకుని ఉండాలి. నాకు ఓ లైఫ్ ఉండాలి. కానీ నా పిల్లల కోణంలో ఆలోచిస్తే అది సరికాదనిపించింది. అయిన కూడా ఒకసారి ట్రై చేశాను. నిశ్చితార్థం చేసుకున్నాను. అది పెద్దలు కుదిర్చింది. అయితే నేను ఆ రిలేషన్ కు, నా పిల్లలకు న్యాయం చేయలేననిపించింది. అందుకే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాను.
నేను సింగిల్ పేరెంట్. ఒకరితో పిల్లలు కలిగిన తర్వాత మరొకరి జీవితంలోకి రావడం అనేది చాలా సున్నితమైన విషయం. నేను నా లైఫ్‌లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానిస్తే పిల్లలకు పూర్తి సమయం కేటాయించలేను. అందుకే మరొకరితో రిలేషన్లోకి వెళ్లలేదు. ఆధ్యకు ఇప్పుడు 15 ఏళ్లు. 18 ఏళ్లు వచ్చి కాలేజీకి వెళ్తూ తన లైఫ్‌లో తాను బిజీ అయ్యాక నేను రెండో పెళ్లి గురించి ఆలోచిస్తాను` అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.