రష్మిక మందన్న లాక్ డౌన్ లో కొత్త తోడునుకు కనుక్కుంది. యామి గౌతమ్ వంటి చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటుంటే రష్మిక మందన్న ప్రేమలో పడింది. మీరు కంగారు పడకండి ఆమె ప్రేమలో పడింది… తన పెంపుడు కుక్క ఆరాతో!
ఆరా తాజా చిత్రాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. కరోనాలో అందరూ ఇంటికి పరిమితమై ప్రపంచమంతా గందరగోళంగా ఉన్న నేపథ్యంలో నా పెంపుడు జంతువు నాకు తోడుగా, సహాయంగా ఉంటూ నాకు ఆనందాన్నిచ్చింది.
రష్మిక తన తాజా పోస్టును ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లలో షేర్ చేసింది. అందులో తన పెంపుడు కుక్క ఆరాను ప్రపంచానికి పరిచయం చేసింది. హృదయపూర్వకంగా రాసిన పోస్ట్‌లో ఆరాపై తన ప్రేమనంతా ఒలకబోసింది.
3 సెకండ్లలో ప్రేమలో పడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ నేను 0.3 సెకన్లలో ఆరాతో ప్రేమలో పడ్డానని రష్మిక తెలిపింది.
రష్మిక చేతిలో ప్రాజెక్టులు :
రష్మికకు సూర్య మరియు దుల్కర్ సల్మాన్ లతో సినిమాలు ఉన్నాయి. సూర్యతో కలిసి తమిళ చిత్రంలో, రష్మిక ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
దుల్కర్ సల్మాన్ సినిమాకు ఇంకా పేరుపెట్టలేదు. అల్లు అర్జున్ పుష్పలో కూడా రష్మిక చేస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో ఆమె మొదటిసారి అల్లు అర్జున్‌తో జత కట్టింది.